Asianet News TeluguAsianet News Telugu

18 ఏళ్ళు పైబడిన వారికి కోవిడ్-19 వ్యాక్సిన్ : ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 1.32 కోట్ల రిజిస్ట్రేషన్లు

కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయిన కొద్ది గంటల్లోనే రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఏప్రిల్ 28 రాత్రి 12:30 వరకు జరిగిన ఈ గణాంకాలలో  మొదటి గంటలో 35 లక్షల మంది రిజిస్ట్రర్ చేసుకున్నారు. 
 

covid-19 vaccination registrations crossed 1-32 crore in one day through cowin portal
Author
Hyderabad, First Published Apr 30, 2021, 11:14 AM IST

 ఏప్రిల్ 28 సాయంత్రం 4 గంటల నుండి  18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కరోనా వ్యాక్సిన్  రిజిస్ట్రేషన్స్ ప్రారంభమైన  సంగతి మీకు తెలిసిందే.  అయితే వాక్సిన్  రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన కొద్దిసేపటికే  కోవిన్ పోర్టల్ క్రాష్ కావడం ప్రారంభమైంది.

చాలా మందికి ఓ‌టి‌పికి పొందడంలో  ఇబ్బందులు ఎదురైనట్లు పేర్కొనగా, మరికొందరికి రిజిస్టర్ అయిన తరువాత స్లాట్ బుకింగ్  లో సమస్యలు ఎదురైనట్లు తెలిపారు.

కరోనా వ్యాక్సిన్  రిజిస్ట్రేషన్స్ ప్రారంభమైనప్పటి నుండి కేవలం మూడు గంటల్లో 55 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే ఆరోగ్య సేతు రిజిస్ట్రేషన్స్ ప్రారంభంమైన మొదటి రోజు 1.32 కోట్ల మంది టీకా కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు ట్వీట్ చేసింది.

also read ఫేస్ బుక్ ట్రిక్స్ : మీ ప్రొఫైల్‌, టైమ్ లైన్ ను ఎవరు రహస్యంగా చూస్తున్నారో ఈ విధంగా తెలుసుకొండి.. ...

ఈ గణాంకాలు ఏప్రిల్ 28 రాత్రి 12 గంటల  వరకు జరిగినవి. మొదటి గంటలో 35 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.

వ్యాక్సిన్ పొందే విషయానికొస్తే ఆరోగ సేతు  ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతోందని తెలిపింది. వాక్సినేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రజలకు అపాయింట్‌మెంట్ లభిస్తుంది.  

ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా రెండు టీకాలను ప్రజలకు వేస్తున్నారు. వాటిలో ఒకటి కోవాక్సిన్, మరొకటి కోవిషీల్డ్. ఇవి కాకుండా స్పుత్నిక్ వి కూడా  ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఆలోచన ఉంది. అలాగే ఇతర విదేశీ టీకాలు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు పరిగణించనున్నారు,
 

Follow Us:
Download App:
  • android
  • ios