కరోనాతో కోలుకోలేని దెబ్బ: ఆర్థిక వ్యవస్థపై 25 లక్షల కోట్ల దాకా నష్టం ?!
కరోనా వైరస్ విలయం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగానే ఉండనున్నది. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ పరిశోధకుల అంచనా ప్రకారం 2.4 లక్షల కోట్ల డాలర్ల మేరకు ఆర్థిక వ్యవస్థ కోల్పోనున్నదని తేలింది. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) మరో అడుగు ముందుకేసి రూ.15 లక్షల కోట్లు.. ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ రూ.25 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావంపై రకరకాల అధ్యయనాలు సాగుతున్నాయి. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ అధ్యయనం 2.3 లక్షల కోట్ల డాలర్ల మేరకు కరోనా వైరస్ నష్టాన్ని మిగులుస్తుందని అంచనా వేసింది. ఇక ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకు (ఏడీబీ) ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 77-347 బిలియన్ల డాలర్లు (రూ.5 లక్షల కోట్లు-రూ.25 లక్షల కోట్లు) ఉండొచ్చని ఏడీబీ అంచనా వేసింది. ఆసియా, పసిఫిక్ దేశాల ఆర్థిక వ్యవస్థలకు కరోనా వైరస్ వల్ల రూ.15 లక్షల కోట్ల (21,100 కోట్ల డాలర్ల) నష్టం వాటిల్లుతుందని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది.
also read బంగారం ధరలు సరికొత్త రికార్డు...తాజాగా10 గ్రాముల ధర ఎంతంటే ?
ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మందిని బలి తీసుకోనుందని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు పరిశోధకుల తాజా అధ్యయనం హెచ్చరించింది. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 2.3 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనుందని పేర్కొంది. కరోనా ‘తీవ్రత తక్కువ’ ఉన్న సందర్భంలో ఈ మేరకు నష్టం సంభవించవచ్చని వెల్లడించింది.
తొలి ఏడాదిలోపు చైనా, భారత్, అమెరికాలో లక్షల్లో ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా వేశారు. బ్రిటన్ జీడీపీ 1.5 శాతం, అమెరికా జీడీపీ 2 శాతం తగ్గనుందని ఈ అధ్యయనం వెల్లడించింది. కరోనా ‘తీవ్రత అధికం’గా ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 9.2 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లవచ్చని, అనేక దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతాయని పేర్కొన్నారు. ఇక కరోనా ‘తీవ్రత మధ్యస్థం’గా ఉంటే ఆర్థిక వ్యవస్థకు 5.3 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం సంభవించవచ్చన్నారు.
ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై కరోనా తీవ్ర ప్రభావం చూపనున్నదని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 77-347 బిలియన్ల డాలర్లు (రూ.5 లక్షల కోట్లు-రూ.25 లక్షల కోట్లు) ఉండొచ్చని ఏడీబీ అంచనా వేసింది. గిరాకీ తగ్గుదల, పర్యాటకం, వాణిజ్యం, ఆరోగ్య సమస్యలు తదితర రూపాల్లో ఆసియాలోని అభివ్రుద్ధి చెందిన దేశాల్లో సమస్యలు తలెత్తుతాయని ఏడీబీ వెల్లడించింది.
జనవరి నెలాఖరులో తీసుకున్న జాగ్రత్తల నేపథ్యంలో కనీసం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 156 బిలియన్ డాలర్ల మేరకు నష్టం జరిగే అవకాశం ఉన్నదని ఏడీబీ పేర్కొంది. ఇందులో చైనా 103 బిలియన్ డాలర్లు, ఇతర ఆసియా దేశాలు 22 బిలియన్ల డాలర్లు నష్టపోతాయని పేర్కొంది. ఇక కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ఆసియా దేశాలకు ఏడీబీ గత నెలలో 40 లక్షల డాలర్ల సాయం ప్రకటించింది.
also read యెస్ బ్యాంక్...అంతా అస్తవ్యస్తం...రూ.3.28 లక్షల కోట్లు హాంఫట్..
ఆసియా, పసిఫిక్ దేశాల ఆర్థిక వ్యవస్థలకు కరోనా వైరస్ వల్ల రూ.15 లక్షల కోట్ల (21,100 కోట్ల డాలర్ల) నష్టం వాటిల్లుతుందని అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. చైనా జీడీపీపై కనిష్టంగా మూడు శాతం ప్రభావం ఉంటుందని పేర్కొంది. వ్రుద్ధిరేటు దశాబ్దిలోనే కనిష్ట స్థాయికి దిగి వస్తోందని ఎస్ అండ్ పీ వ్యాఖ్యానించింది.
జపాన్, హాంకాంగ్, ఆస్ట్రేలియాలను ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతాయని ఎస్ అండ్ పీ హెచ్చరించింది. 2019లో ఆసియా-పసిఫిక్ ప్రాంతాభివ్రుద్ది 4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. ఇది గత డిసెంబర్ నెలలో అంచనా వేసిన 4.8 శాతం కంటే తక్కువ. చైనా ఆర్థిక వ్యవస్థ వ్రుద్ధి 4.8 శాతానికి దిగి రావచ్చునని అంచనా వేసింది. పర్యాటక రంగం స్తంభించడంతో హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్, వియత్నాం ఆర్థిక వ్యవస్థలు డీలా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.