న్యూ ఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల 10 లక్షల మంది ఉద్యోగులు ఈ రోజు నుండి రెండు రోజుల పాటు సమ్మెకు చేపట్టనున్నారు. ఈ రోజు, రేపు(శుక్ర, శనివారం) దేశవ్యాప్తంగా బ్యాంక్ కార్యకలాపాలపై ప్రభావితం కానున్నాయి.ఉద్యోగుల వేతన సమస్యలు, డిమాండ్ల పై బ్యాంక్ యూనియన్లు  సమ్మె  ప్రారంభించాయి. 

also read ఐబిఎం కొత్త సిఇఓగా అరవింద్ కృష్ణ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజు తన రెండవ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.రెండు రోజుల సమ్మెతో పాటు ఆదివారం సహా మూడు రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. బ్యాంక్ సమ్మె తరువాత ఫిబ్రవరి 3 సోమవారం  రోజున మళ్ళీ బ్యాంకులు తిరిగి తెరవబడతాయి.

దేశవ్యాప్తంగా  ఈ సమ్మె కారణంగా పలు బ్యాంకు శాఖలు, ఎటిఎంల సేవలు తగ్గే అవకాశం ఉంది.ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు మాత్రం పనిచేస్తాయి.సమ్మె కారణంగా బ్యాంకు కార్యకలాపాలు కొంతవరకు ప్రభావితమవుతాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా చాలా బ్యాంకులు తమ వినియోగదారులకు ముందుగానే తెలియజేశాయి.

also read ఆ కారణాల వల్లె రాజీనామా చేశాను :విప్రో సి‌ఈ‌ఓ

నగదు డిపాజిట్, విత్ డ్రా, చెక్ క్లియరెన్సులు, జారీ, రుణ పంపిణీ కార్యకలాపాలపై ఈ సమ్మె మరింతగా ప్రభావితం చేయవచ్చు.తొమ్మిది కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్లు, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు విఫలం కావడంతో  సమ్మె ముందుకు సాగాలని నిర్ణయించింది.


ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగుల వేతన సవరణ నవంబర్ 2017 నుండి పెండింగ్‌లో ఉంది.ప్రాథమిక వేతనంతో ప్రత్యేక భత్యం విలీనం, పెన్షన్ అప్ డేట్, కుటుంబ పెన్షన్ వ్యవస్థలో మెరుగుదల, ఐదు రోజుల బ్యాంకింగ్ పని దినాలు, నిర్వహణ లాభాల ఆధారంగా సిబ్బంది సంక్షేమ నిధిని కేటాయించడం, పదవీ విరమణ ప్రయోజనాలపై ఆదాయపు పన్ను నుండి మినహాయింపు వంటి అనేక డిమాండ్లు వారు  కోరుతున్నారు.