న్యూ ఢిల్లీ: దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం విప్రో సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ అబిదాలి జెడ్ నీమూచ్‌వాలా తన పదవులకు రాజీనామా చేశారు. తాను విప్రో కంపెనీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఐటి సర్వీసెస్ మేజర్ విప్రో శుక్రవారం ఈ విషయాన్ని తెలిపింది.

also read Budget 2020:కార్యాలయాలు, కంపెనీల లైసెన్సులపై వీపీ సింగ్‌ కొరడా!

52 ఏళ్ల మిస్టర్ అబిదాలి తన సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో  కొత్త సి‌ఈ‌ఓ నియామకం జరిగే వరకు తాను సి‌ఈ‌ఓగా కొనసాగుతారు. అప్పటివరకు వ్యాపారం యథావిధిగా కొనసాగుతుందని బిఎస్ఇ ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ అబిదాలి జెడ్ నీముచ్వాలా కుటుంబ వ్యవహారాలు, ఇతర కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు విప్రో సంస్థ తెలిపింది.

కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ నియమనికి బోర్డు డైరెక్టర్లు వెతకడం ప్రారంభించారు."అబిదాలి నాయకత్వం ఇంకా విప్రోకు ఆయన చేసిన కృషికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రపంచవ్యాప్తంగా మా డిజిటల్ వ్యాపారాన్ని స్కేల్ చేశాడు" అని విప్రో చైర్మన్ మిస్టర్ రిషద్ ప్రేమ్జీ అన్నారు.

also read Budget 2020: బడ్జెట్‌ అంటే ఏమిటీ..?ఎవరు ప్రవేశపెడతారు...బేసిక్స్‌ మీకోసం...

కాగా మాజీ టీసీఎస్ సీనియర్ ఉద్యోగి అయిన నీముచ్‌వాలా 2015 ఏప్రిల్1న విప్రో సీవోవోగా ఆ తర్వాత ఏడాది సీఈవోగా నియమితులయ్యారు."దాదాపు 75 సంవత్సరాల గొప్ప వారసత్వం కలిగిన విప్రో సంస్థకు సేవ చేయడం నా గౌరవం, నా హక్కు . నాకు సంవత్సరాలుగా సపోర్ట్ ఇచ్చినందుకు అజీమ్ ప్రేమ్జీ, రిషద్, మా డైరెక్టర్ల బోర్డు, నా విప్రో సహచరులకు ఇంకా కస్టమర్లకు కృతజ్ఞతలు" అని అబిదాలి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.