Asianet News TeluguAsianet News Telugu

ఐబిఎం కొత్త సిఇఓగా అరవింద్ కృష్ణ

అమెరికాకు చెందిన దిగ్గ‌జ ఐటీ సంస్థ ఐబిఎం అరవింద్ కృష్ణ  కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ (సి‌ఈ‌ఓ)గా ఎన్నిక‌య్యారు. దీర్ఘకాల సిఇఒ వర్జీనియా రోమెట్టి స్థానంలో అరవింద్ కృష్ణ నియమితులయ్యారు. రెడ్ హాట్‌ను కొనుగోలు చేయ‌డంలో ఆయ‌నే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.రెడ్ హాట్ ఒప్పందానికి నాయకత్వం వహించిన శ్రీ కృష్ణ (57) ఏప్రిల్‌లో సి‌ఈ‌ఓ బాధ్యతలు స్వీకరించనున్నారు.
 

arvind krishna elected as new ceo for  ibm
Author
Hyderabad, First Published Jan 31, 2020, 11:06 AM IST

అమెరికాకు చెందిన దిగ్గ‌జ ఐటీ సంస్థ ఐబిఎం అరవింద్ కృష్ణ  కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ (సి‌ఈ‌ఓ)గా ఎన్నిక‌య్యారు.ఐబీఎంకు సుమారు 40 ఏళ్లు దీర్ఘకాల  సేవ‌లందించిన సిఇఒ వర్జీనియా రోమెట్టి స్థానంలో అరవింద్ కృష్ణను బోర్డ్ ఆఫ్ డైర‌క్ట‌ర్లు కొత్త సీఈవోగా ఎన్నుకున్న‌ట్లు సంస్థ పేర్కొన్న‌ది. రెడ్ హాట్ ఒప్పందానికి నాయకత్వం వహించిన శ్రీ కృష్ణ (57) ఏప్రిల్‌లో సి‌ఈ‌ఓ బాధ్యతలు స్వీకరించనున్నారు.   

also read ఆ కారణాల వల్లె రాజీనామా చేశాను :విప్రో సి‌ఈ‌ఓ

మిస్టర్ కృష్ణ 1990 లో ఐ‌బి‌ఎంలో చేరారు. కాన్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పి‌హెచ్‌డి పట్టా పొందారు.అరవింద్ కృష్ణ   ఐబీఎంలో క్లౌడ్ మరియు అనలిటిక్స్ స్పేస్ కు సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం ఉన్నారు.  

arvind krishna elected as new ceo for  ibm

ఎంఎస్ రోమెటీ ఏప్రిల్ 6 న తన పదవి నుండి తప్పుకొనున్నారు, కాని ఈ ఏడాది చివరి వరకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవిగా కొనసాగుతారు. ఆమె ఐబీఎం సంస్థతో    సుమారు 40 ఏళ్లు సేవ‌లందించారు అని ఐబిఎం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.2012 లో 62 ఏళ్ల ఎంఎస్ రోమెట్టి ఐ‌బి‌ఎంలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి వాట్సన్ ప్రోగ్రాం ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు.

also read బంగారం రికార్డు ధర...తగ్గిన డిమాండ్


ఐ‌బి‌ఎం సంస్థ క్లౌడ్ సేవల బిజినెస్ లోకి ఆలస్యంగా ప్రవేశించింది. ఇప్పుడు అమెజాన్.కామ్ ఇంక్ ఇంకా మైక్రోసాఫ్ట్ కార్ప్ ఆధిపత్యంలో ఉంది. 40 సంవత్సరాలపాటు ఐ‌బి‌ఎంలో అనుభవం ఉన్న అలాగే యుఎస్ లోని అత్యున్నత ప్రొఫైల్ కలిగిన మహిళలలో ఒకరిగా ఎంఎస్ రోమెట్టి ఉన్నారు.


గ్లోబల్ ఐటి దిగ్గజం అధిపతిగా అరవింద్ కృష్ణ నియామకం భారతీయ సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్ల జాబితాలో  చేరారు.  మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల, గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా, పెప్సికో మాజీ సీఈఓ ఇంద్ర నూయి, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్‌లు ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios