బ్యాంకుల సమ్మె... కస్టమర్లను అలర్ట్ చేసిన ఎస్‌బి‌ఐ...

భారత బ్యాంక్ అసోసియేషన్ (ఐబిఎ) తో వేతన సవరణపై చర్చలు విఫలమైన తరువాత యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) జనవరి 31, ఫిబ్రవరి 1న భారతదేశం అంతటా సమ్మెకు చేయటానికి ప్రణాళికలు చేసింది.

bank employees strike on january 31 february 1

బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన కరణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్యాంకు ఖాతాదారులను అప్రమత్తం చేసింది.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) శుక్రవారం ఒక అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. భారత బ్యాంక్ అసోసియేషన్ (ఐబిఎ) తో వేతన సవరణపై చర్చలు విఫలమైన తరువాత యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) జనవరి 31, ఫిబ్రవరి 1న భారతదేశం అంతటా సమ్మెకు చేయటానికి ప్రణాళికలు చేసింది.

also read ఎయిర్ ఏషియా ఉన్నతాధికారులకు సమన్లు ​​జారీ...

ఇతర డిమాండ్లతో పాటు 20 శాతం వేతన సవరణ, 5 రోజుల పని దినాలు, పెన్షన్ల అప్ డేట్, కుటుంబ పెన్షన్ల అభివృద్ధి వంటి డిమాండ్లను నెరవేర్చలని యూనియన్లు కోరుతున్నారు.తమ శాఖలు, కార్యాలయాల్లో సజావుగా పనిచేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌బిఐ తెలిపింది. కానీ, సమ్మే కరణంగా బ్యాంక్ సేవలపై కొంత ప్రభావం చూపుతుండొచ్చు అని  తెలిపింది.

bank employees strike on january 31 february 1

UFBU తొమ్మిది కార్మిక సంఘాలను సూచిస్తుంది అందులో ఆల్ ఇండియా ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( BEFI)

also read ఇన్‌స్టాగ్రామ్‌ లో రతన్ టాటా వైరల్ ఫోటో...గంటలో లక్షకు పైగా లైక్స్ 

ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (INBEF), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (NOBW) ఆలాగే నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (NOBO). జనవరి 8న బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగారు, అయితే ఈ సమ్మే పిఎస్‌యు బ్యాంకుల విలీనం ఇంకా మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలకు సంబంధించినది తెలుస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios