విదేశీ విమానాల అనుమతి కోసం ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వడం, భారతీయ ఆపరేటర్ల కంట్రోల్ నుంచి విదేశీ విమానాలను నిరోధిస్తూ నిబంధనలను ఉల్లంఘించినట్లు  ఎయిర్‌ఏషియాపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మే 2018లో సిబిఐ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎయిర్‌ఏషియా మేనేజ్‌మెంట్‌లోని ముగ్గురు ఉన్నతాధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు ​​జారీ చేసింది.

also read ఇన్‌స్టాగ్రామ్‌ లో రతన్ టాటా వైరల్ ఫోటో...గంటలో లక్షకు పైగా లైక్స్

ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ ఫెర్నాండెజ్‌ను ఫిబ్రవరి 5 న, ఆయన డిప్యూటీ అధికారి బో లింగం, ఎయిర్‌ఏషియా ఇండియా డైరెక్టర్ ఆర్ వెంకటరమణను ఫిబ్రవరి 3, 10 తేదీల్లో హాజరుకావాలని కోరింది.

విదేశీ విమాన అనుమతి కోసం ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వడమే కాకుండా భారతీయ ఆపరేటర్ల కంట్రోలింగ్ నుంచి  విదేశీ ఎయిర్ లైన్స్ నిరోధించి నిబంధనలను ఉల్లంఘించడంపై ఎయిర్‌ఏషియా యాజమాన్యంపై సిబిఐ తన  ఫిర్యాదులో ఆరోపించినట్లు పేర్కొంది. ఎయిర్ ఏషియా ఉన్నతాధికారులను సిబిఐ మొదటిగా జూలై 2018లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఈ నెలలో వారిని హాజరుకావలని తెలిపిన వారు ఆదేశాలను పాటించలేదు.


ఎయిర్‌ఏషియాపై మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తుకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు గురువారం రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించింది.చీఫ్ జస్టిస్ డి.ఎన్. పటేల్, జస్టిస్ సి హరిశంకర్ల డివిజన్ బెంచ్ ప్రోబ్ ఏజెన్సీని సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని కోరింది అలాగే మే 14 న తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.

also read ప్రయాణికులకు ఐఆర్‌సిటిసి వార్నింగ్...జాగ్రతగా ఉండండి లేదంటే...?


ఎయిర్ ఏషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్రం మంజూరు చేసిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు క్లియరెన్స్‌ను సవాలు చేస్తూ బిజెపి నాయకుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది.ఇంతకుముందు, ఈ విషయంపై స్టేటస్ రిపోర్ట్ ను సీల్డ్ కవర్లో దాఖలు చేయాలని కోర్టు సిబిఐని కోరింది.

5/20 నిబంధన ప్రకారం, ఒక సంస్థకు కనీసం ఐదేళ్ల పాటు ఎయిర్ లైన్స్ నడిపించిన అనుభవం అవసరం ఇంకా  లైసెన్స్‌కు అర్హత సాధించడానికి కనీసం 20 విమానాలను కలిగి ఉండాలి.