Asianet News TeluguAsianet News Telugu

ఓలా & ఉబెర్ క్యాబ్ సర్వీసులకు చెక్... క్యాబ్ అగ్రిగేటర్‌గా మహీంద్రా

క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా, ఉబెర్ సంస్థలకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా చెక్ పెట్టనున్నది. అలైట్ పేరుతో విడుదల చేయనున్న యాప్ ద్వారా తన మొబిలిటీ సర్వీసులన్నీ ఒకే వేదిక కిందకు తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

Anand Mahindra's M&M to compete with Ola, Uber with launch of cab aggregator service
Author
Hyderabad, First Published Mar 3, 2020, 11:23 AM IST

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ఎం) క్యాబ్ అగ్రిగేటర్, షేర్డ్ మొబిలిటీ సర్వీసుల రంగంలోకి అడుగు పెట్టనుంది. ప్రధానంగా కార్పొరేట్ల కోసం ‘అలైట్’ అని పిలిచే క్యాబ్ అగ్రిగేటర్‌ సేవలను ప్రారంభించనుంది. 

వచ్చే రెండు-మూడు సంవత్సరాలలో అలైట్‌ సేవలను అందుబాటులోకి తేవాలని ఆనంద్‌ మహీంద్రా నేతృత్వంలోని మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రణాళికలు రూపొందిస్తోంది. తద్వారా ఇప్పటికే ఈ రంగంలో సేవలు అందిస్తున్న సంస్థలు ఓలా, ఉబర్‌లకు ప్రత్యక్షంగా గట్టి పోటీ ఇవ్వనుంది.

also read ఐటీ రంగంలో భారీగా కొత్త ఉద్యోగావకాశాలు...దాదాపు లక్ష వరకు...

క్యాబ్‌ సర్వీసుల నిర్ణయంతోపాటు, తన మొబిలిటీ వ్యాపారాలన్నీ ఏకం చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది ఎం అండ్‌ ఎం. అలైట్ (ప్రస్తుతం మహీంద్రా లాజిస్టిక్స్), మేరూ క్యాబ్స్ (మెజారిటీ షేరు ఉన్న ఎం అండ్‌ ఎం), గ్లైడ్ (ఎం అండ్‌ ఎం ఇ-వెహికల్ క్యాబ్ సర్వీస్), ఫస్ట్ ఛాయిస్ (యూజ్డ్‌ కార్ల బిజినెస్‌) ఇలా అన్నీ మొబిలిటీ సర్వీసులను అలైట్ పేరుతో ఒకే గొడుగు కిందికి తీసుకురానుంది. 

ఇందుకోసం ‘అలైట్’ పేరుతో ఒకయాప్‌ త్వరలోనే విడుదల చేయనుంది. ఈ త్రైమాసికం నుండి దేశవ్యాప్తంగా తమ బ్రాండ్‌ను పరిచయం చేప్తామని మహీంద్రా లాజిస్టిక్స్ సీఈవో రాంప్రవీణ్‌ స్వామినాథన్ చెప్పారు. వివిధ సంస్థలతో ఒప్పంద ప్రాతిపదికన ఇది పని చేస్తుందని తెలిపారు. 

also read ఆర్థిక వ్యవస్థకు కరోనా కష్టాలు...దశాబ్ద కనిష్టానికి వృద్ధిరేటు...

ప్రాథమికగా కంపెనీ ఉద్యోగులను ఆఫీసులనుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీసులకు, లేదా వివిధ కాన్ఫరెన్సులు, స​మావేశాలకు, విమానాశ్రయాలకు తీసుకెళ్లే సేవలు ఉంటాయి. క్రమంగా ఈ సేవలను కాల్‌-ఆన్ సేవలుగా విస్తరించనుంది. ఓలా కార్పొరేట్ ఫీచర్ ద్వారా కార్పొరేట్ టాక్సీ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

మరో సంస్థ ఉబెర్ కూడా ఉబెర్ ఫర్ బిజినెస్ ఫీచర్ ద్వారా ఈ విభాగంలోకి ఇటీవలే ప్రవేశించింది. దాదాపు 10వేల కంపెనీలు ప్రస్తుతం ఓలా కార్పొరేట్‌ సేవలు వినియోగించుకుంటున్నాయి. అయితే ఓలా, ఉబెర్‌ బీ టూ సీ సేవలతో పోలిస్తే కార్పొరేట్ భాగస్వామ్యాలతో బీ టూ బీ సేవలతో అలైట్  భిన్నంగా వుంటుందని కంపెనీ తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios