హైదరాబాద్:సంక్రాంతి పండగను పురస్కరించుకొని బంగారం అమ్మకాల్లో సరికొత్త మార్పులకు కేంద్రప్రభుత్వం స్వీకారం చుట్టింది..జనవరి 15నుంచి గోల్డ్ హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. 

నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న బంగారం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకునేలా హెచ్చరికలు జారీ చేసింది. వాస్తవానికి గోల్డ్ హాల్ మార్క్ ను 2001లోనే అప్పటి కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

Also read:ద్రవ్యోల్బణం ఎఫెక్ట్: ఫిబ్రవరిలోనూ రెపో రేటు యథాతథమే!

 దేశ వ్యాప్తంగా 900హాల్ మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కేంద్రాల్లో మాత్రమే ఈ హాల్ మార్కింగ్ ను వినియోగిస్తున్నాయి. అనధికారిక విక్రయాలు చేసేందుకు బంగారం వ్యాపారస్థులు ఈ హాల్ మార్క్ ను వినియోగించేందుకు వ్యతిరేకిస్తున్నారు.

Also read:టోకు ధరల సూచీలో కూర‘గాయాలే’.. 8 నెలల గరిష్ఠానికి డబ్ల్యూపీఐ

 ఈ హాల్ మార్క్ ను వినియోగించడం వల్ల అనధికారిక ట్రాన్సాక్షన్లు చేసేందుకు అవకాశం ఉండదు. తద్వరా వివిధ మార్గాల్లో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే దీనిపై కేంద్రం కఠిన చర్యలు విధించింది. హాల్ మార్కింగ్ ను తప్పని సరి చేసింది. దీంతో బంగారంపై కొనుగోళ్లు భారీగా జరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.  

Also read:ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో జియో.. ఎయిర్‌టెల్ కూడా

సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా   నిన్న, ఈ రోజు బంగారం ధర నామమాత్రంగానే ఉన్నాయి. ధరల్లో ఎలాంటి మార్పులు సంతరించుకోలేదు. ప్రధాన నగరాల్లో 22క్యారట్లు, 24 క్యారట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి.    

గ్రాముల్లో 22 క్యారట్ల బంగారం ధరలు 

1 గ్రాము  ధర 3,765 ఉండగా నిన్నటికి ఇవ్వాల్టి వ్యత్యాసం  రూ.1 మాత్రమే 
8గ్రాముల బంగారం ధర రూ.30,120  ఉండగా నిన్నటికి ఈ రోజుకి వ్యత్యాసం రూ.8 మాత్రమే ఉంది. 
10  గ్రాముల బంగారం ధర 37,650  ఉండగా నిన్నటికి ఈ రోజుకి వ్యత్యాసం రూ.100గా ఉంది.   
100 గ్రాముల బంగారం ధర రూ.3,76,500  ఉండగా నిన్నటికి ఈ రోజుకి  బంగార వ్యత్యాసం రూ.100గా ఉంది. 
గ్రాముల్లో 24 క్యారట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి
1 గ్రాము బంగారం ధర రూ.4,107 ఉండగా నిన్నటికి ఈ రోజుకి బంగారం ధర వ్యత్యాసం రూ.1 మాత్రమే ఉంది.
8 గ్రాముల బంగారం ధర రూ.32,856 ఉండగా నిన్నటికి ధరకి ఈరోజు బంగారం ధరకి మధ్య రూ.8 వ్యత్యాసం ఉంది. 
10 గ్రాముల బంగారం ధర రూ.41,070 ఉండగా నిన్నటి ధరకి ఈ రోజు బంగారం ధరకి మధ్య వ్యత్యాసం రూ.10మాత్రమే ఉంది. 
100 గ్రాముల బంగారం ధర రూ.4,10,700 ఉండగా నిన్నటి ధరకి ఈ రోజు బంగారం ధరకి మధ్య వ్యత్యాసం రూ.100మాత్రమే ఉంది. 
మనదేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారట్లు,24 క్యారట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 
చెన్నైలో 22 క్యారట్ల బంగారం ధర రూ.37,650 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.41,070 గా ఉంది. 
ముంబైలో 22 క్యారట్ల బంగారం ధర రూ.38,810 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ. 39,910 గా ఉంది
న్యూఢిల్లీలో 22 క్యారట్ల బంగారం ధర రూ.38,460  ఉండగా 24క్యారట్ల బంగారం ధర రూ.39,660 గా ఉంది
బెంగళూరు లో 22 క్యారట్ల బంగారం ధర రూ. 36,960 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.40,310 గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారట్ల బంగారం ధర రూ.  37,650 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.41,070 గా ఉంది
విశాఖ పట్నం లో 22క్యారట్ల బంగారం ధర రూ. 37,650 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.41,070 గా ఉంది.
విజయవాడలో 22 క్యారట్ల బంగారం ధర రూ.37,650 ఉండగా 24 క్యారట్ల బంగారం ధర రూ.41,070 గా ఉంది.