Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ ఇండియాకి షాక్: విమానంలో ప్రయాణించిన ఏడుగురికి కరోనా పాజిటివ్..

ఈ నెల ప్రారంభంలో ఆగస్టు 14న ఢీల్లీ నుండి హాంకాంగ్ వెళ్తున్నా విమానంలో 14 మంది ప్రయాణికులకు కోవిడ్ -19 పరీక్షలు చేయడంతో వారికి పాజిటివ్ అని తేలింది. అయితే అన్ని ఎయిర్ ఇండియా ప్యాసెంజర్ విమానాలు ఆగస్టు చివరి వరకు హాంకాంగ్‌లో దిగకుండా నిరోధించారు.

AirIndia passengers tests COVID-19 positive in New Zealand after arrival from newDelhi
Author
Hyderabad, First Published Aug 29, 2020, 4:15 PM IST

న్యూ ఢీల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో న్యూఢీల్లీ నుంచి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు ప్రయాణించిన ఏడుగురు ప్రయాణికులు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిచినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో ఆగస్టు 14న ఢీల్లీ నుండి హాంకాంగ్ వెళ్తున్నా విమానంలో 14 మంది ప్రయాణికులకు కోవిడ్ -19 పరీక్షలు చేయడంతో వారికి పాజిటివ్ అని తేలింది. అయితే అన్ని ఎయిర్ ఇండియా ప్యాసెంజర్ విమానాలు ఆగస్టు చివరి వరకు హాంకాంగ్‌లో దిగకుండా నిరోధించారు.

"ఆదివారం ఎయిర్ ఇండియా విమానంలో ఢీల్లీ నుండి ఆక్లాండ్ వెళ్తున్నా విమానంలో ఏడుగురు ప్రయాణికులకు కోవిడ్ -19 టెస్ట్ చేయగా వారికి పాజిటివ్ అని తేలింది" అని ప్రభుత్వ అధికారి తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మార్చి 23 నుండి షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు భారతదేశంలో నిలిపివేసినప్పటికీ, వందే భారత్ మిషన్ కింద భారతదేశం నుండి వివిధ దేశాల మధ్య ఏర్పడిన ఎయిర్ బబుల్ ఒప్పందాల క్రింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి.

శుక్రవారం ఆక్లాండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో న్యూజిలాండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కరోలిన్ మెక్‌ల్నే మాట్లాడుతూ, "కోవిడ్ -19 కేసుల్లో ఐదు కొత్తగా ధృవీకరించిన పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీనికి ముందు ఏడు ఉన్న కేసులుతో  మొత్తం 12 కొత్త కేసులు  ఉన్నయి"అని అన్నారు. కొత్తగా నమోదైన ఏడు కేసులన్నీ ఆగస్టు 23న ఒకే విమానంలో వచ్చినవారే.

also read అప్పుల్లో ఉన్న అనిల్ అంబానీ ఇంటి లోపల చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందే..

"పాజిటివ్ వచ్చిన వారిని ఆక్లాండ్‌లో  జెట్ పార్క్ హోటల్‌లోని క్వారంటైన్ కేంద్రానికిపంపించారు" అని ఆమె తెలిపారు. ప్రయాణించినవారు కోవిడ్-19 అధికంగా ఉన్న దేశాల నుండి ప్రయాణించారు, అందువల్ల వారు విమానంలో ఎక్కేముందు వారికి పాజిటివ్ కేస్ అని గుర్తించలేదు" అని ఆమె పేర్కొంది.

మెక్‌ల్నేతో పాటు, న్యూజిలాండ్ ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్‌సన్ కూడా ఆక్లాండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రయాణీకులు ఏ దేశం నుండి వచ్చారు అని అడిగిన ప్రశ్నకు రాబర్ట్ సన్ విలేకరులతో "నేను ఏ దేశం అని వచ్చానో చెప్పదలచుకోలేదు ఎందుకంటే ప్రతి ప్రయాణికుడు ఏ దేశం నుండి వచ్చాడో నాకు తెలియదు, ఫ్లైట్ అయితే మాత్రం ఎయిర్ ఇండియా ఫ్లైట్, కానీ దీనికి అర్థం ఆ విమానంలో వచ్చిన వారంతా తప్పనిసరిగా భారతదేశం నుండి వచ్చిన వారే అని కాదు. " అని అన్నారు.

ఒకే రోజు 77,266 కోవిడ్ -19 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 33,87,500కు చేరుకుంది, రికవరీ  అయిన వారి సంఖ్య  25,83,948కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 1,057 మంది మరణించగా ఈ వైరస్ బారినపడి మరణించిన వారి మొత్తం సంఖ్య 61,529 కు చేరుకుంది.

ఆగస్టు 21న పిటిఐ ప్రకటనలో హాంకాంగ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రతినిధి  మాట్లాడుతూ"ఆగస్టు 14న భారతదేశం నుండి హాంకాంగ్ చేరుకున్న ఎయిర్ ఇండియా (AI314) నడుపుతున్న విమానంలో 11 మంది ప్రయాణికులు COVID-19 బారిన పడినట్లు నిర్ధారించారు.

Follow Us:
Download App:
  • android
  • ios