ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో నుండి సరికొత్త మోడల్ లాంచ్ కానుంది. OPPO F33 Pro ఏప్రిల్ 23, 2026 నుండి అందుబాటులోకి రానుంది. మరి దీనిలో కొత్తకొత్త ఫీచర్లు ఏమున్నాయో తెలుసుకుందాం.
మీరు నిత్యం బిజిబిజీగా గడిపే వర్కింగ్ ప్రొఫెషనలా..? మీ రోజు వేగంగా గడిచిపోతుందా..? అయితే మీకు ఒప్పో ఎఫ్33 ప్రో (OPPO F33 Pro) మంచి సహచరుడు కావచ్చు. మీరు ఏవైనా పనులు పూర్తి చేయాలన్నా, ఇతరులతో కనెక్ట్ అవ్వాలన్నా, ప్రతిదాన్ని క్యాప్చర్ చేయాలన్నా ఇది ఉపయోగపడుతుంది.
ఎప్పుడూ ప్రయాణాల్లో ఉండేవారికి స్మార్ట్‌ఫోన్‌లో రెండు విషయాలు చాలా ముఖ్యం... ఒకటి మన్నిక (Durability), రెండోది అత్యుత్తమ కెమెరా. రోజువారీ వాడకంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తూనే ముఖ్యమైన క్షణాలను మిస్ చేయకుండా ఉండాలి. ఇందకు పర్పెక్ట్ గా సరిపోతుంది కొత్తగా లాంచ్ అయిన OPPO F33 సిరీస్. దీనిలో OPPO F33 Pro 5G, OPPO F33 ఉన్నాయి... ఇవి కచ్చితంగా అటువంటి జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి.
సెల్ఫీల కోసం అద్భుతమైన కెమెరా

ఒక సాధారణ వారాంతాన్ని తీసుకోండి... మీరు స్నేహితులను కలుస్తారు, భోజనానికి బయటకు వెళ్తారు, లేదంటే ఎక్కడికైనా దగ్గర్లో డ్రైవింగ్‌కు వెళ్తారు, చివరకు ఎన్నో జ్ఞాపకాలను బంధిస్తారు. ఇక్కడే F33 Pro 50MP అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరా ప్రత్యేకంగా నిలుస్తుంది. 100° ఫీల్డ్ ఆఫ్ వ్యూతో ఇది వ్యక్తులను ఇరుకుగా సర్దాల్సిన అవసరం లేకుండా సీన్‌ను ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ ప్రాక్టికల్ ఫీచర్ ఏంటంటే 'ఆటో-స్విచ్'. ఫ్రేమ్‌లో ఇద్దరి కంటే ఎక్కువ ముఖాలు కనిపించినప్పుడు కెమెరా ఆటోమేటిక్‌గా 1x నుండి 0.6xకి మారుతుంది, తద్వారా అందరూ ఫ్రేమ్‌లో సరిపోతారు. ఇది ఈ సెగ్మెంట్‌లో ఒప్పో మాత్రమే అందిస్తున్న మొదటి ఫీచర్. మీరు కెమెరా యాంగిల్స్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేనందున గ్రూప్ సెల్ఫీలను క్లిక్ చేయడానికి ఇది సులభమైన, వేగవంతమైన మార్గాలలో ఒకటి.
తక్కువ వెలుతురులో సెల్ఫీలు సాధారణంగా రిస్క్‌తో కూడుకున్నవి... కానీ మల్టీ-కలర్ ఫ్లాష్‌తో వీటికి బూస్ట్ లభిస్తుంది. ఇది కేవలం బ్రైట్‌నెస్ మాత్రమే కాదు మీరు టోన్స్‌ను అడ్జస్ట్ చేసి స్మూత్ గా, సహజంగా కనిపించే ఫోటోలను పొందవచ్చు, ఇది ముఖ్యంగా రాత్రిపూట లేదా ఇండోర్ మీటింగ్స్‌లో ఉపయోగపడుతుంది.
ఈ ఒప్పో ఎఫ్33 ప్రో వెనుక వైపు సరికొత్త కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇది డిజైన్ పరంగా ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. దీనికి స్టారీ సీ లెన్స్ మాడ్యూల్ (Starry Sea Lens Module) అని పేరు పెట్టారు... ఇది నిశ్శబ్ద అడవిలో రాత్రి నక్షత్రాల అందాన్ని ప్రతిబింబిస్తుంది. కెమెరా మాడ్యూల్ లోపల మెరిసే ఇసుక వంటి యాక్సెంట్స్ ద్వారా ఈ ఎఫెక్ట్‌ను క్రియేట్ చేశారు.
ఈ కెమెరా మాడ్యూల్ పెద్దగా, రౌండెడ్ రెక్టాంగులర్ ఐలాండ్ లాగా రూపొందించబడింది. రెండు బోల్డ్ సర్క్యులర్ లెన్స్‌లు రింగ్-ఫ్లాష్ లోపల నిలువుగా ఉంచబడ్డాయి. ఇది గత మోడల్ నుండి పూర్తిగా భిన్నంగా ఉండి, డివైజ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది.
హార్డ్‌వేర్ విషయానికి వస్తే ఆటోఫోకస్‌తో కూడిన 50MP అల్ట్రా-క్లియర్ కెమెరా పోర్ట్రెయిట్స్, అవుట్‌డోర్ షాట్స్, సెట్టింగ్స్ మార్చే సమయం లేనప్పుడు క్విక్ క్యాప్చర్స్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేస్తుంది. 2MP డెప్త్ కెమెరా AI బోకెకు సపోర్ట్ చేస్తుంది, కాబట్టి పోర్ట్రెయిట్స్‌లో సబ్జెక్ట్ స్పష్టంగా ఉండి, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ సహజంగా వస్తుంది.

మీరు కంటెంట్ క్రియేట్ చేసినా లేదా ఒకేసారి రెండు వైపుల దృశ్యాలను బంధించాలనుకున్నా డ్యూయల్-వ్యూ వీడియో (Dual-view video) నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది. వ్లాగింగ్ (vlogging) చేసేటప్పుడు, మీ రియాక్షన్, మీరు దేనిని చూస్తున్నారో ఒకే క్లిప్‌లో క్యాప్చర్ చేయడానికి ఇది సరిపోతుంది.
మరో అసాధారణమైన ప్రాక్టికల్ ఫీచర్ 'అండర్ వాటర్ ఫోటోగ్రఫీ'. IP69K రేటింగ్, ప్రత్యేక అండర్ వాటర్ మోడ్‌తో ఈ ఫోన్ 1.5 మీటర్ల లోతు ఉన్న మంచినీటిలో 30 నిమిషాల పాటు మునిగి ఉన్నా తట్టుకోగలదు. అది పూల్ షాట్ అయినా లేదా సరస్సులో ప్రయోగాత్మక ఫోటో అయినా అదనపు జాగ్రత్తలు అవసరం లేదు.
ఎడిటింగ్ విభాగంలో ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా పాపౌట్ (Popout) ఫీచర్ వచ్చింది. గతంలో ఒప్పో ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌లో కనిపించిన ఈ పాపౌట్ ఫీచర్, ఫోటోలు ఫ్రేమ్ నుండి బయటకు వస్తున్నట్లుగా కనిపించేలా కొలేజ్‌లను క్రియేట్ చేయడంలో సహాయపడుతుంది. గ్యాలరీ నుండి 2-9 ఫోటోలను ఎంచుకోవడం ద్వారా, యూజర్లు వాటిని టెంప్లేట్స్‌పై పేర్చి కటౌట్-స్టైల్ విజువల్స్ సృష్టించవచ్చు.

కెమెరా అనుభవానికి కొన్ని AI టూల్స్ తోడయ్యాయి. ఆసక్తికరమైన జోడింపు AI Portrait Glow. ఇది ఫోటోలలో సాధారణ లైటింగ్ సమస్యలను, ముఖ్యంగా టాప్ లైట్, తక్కువ వెలుతురు లేదా బ్యాక్‌లైట్ వంటి పరిస్థితులను సరిచేస్తుంది.

AI Perfect Shot మూసుకున్న కళ్ళు లేదా ఇబ్బందికరమైన ఎక్స్‌ప్రెషన్స్‌ను సరిచేయడంలో సహాయపడుతుంది. AI Recompose ఫ్రేమింగ్, ఆస్పెక్ట్ రేషియోను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. AI Clarity Enhancer జూమ్ చేసిన షాట్స్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది, అలాగే AI Reflection Remover, AI Unblur గ్లేర్, బ్లర్ వంటి సమస్యలను క్లీన్ చేస్తాయి. మీ ఫ్రేమ్‌లో ఏదైనా అవాంఛిత వస్తువు ఉంటే AI Eraser 2.0 ద్వారా దానిని సులభంగా తొలగించవచ్చు.
OPPO F33లో ఫ్రంట్ కెమెరా 16MP కాగా, రియర్ కెమెరా యూనిట్ 50MP + 2MP గా ఉంది.
అందరినీ ఆకట్టుకునే సరికొత్త డిజైన్

మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్-లెవల్ వన్-పీస్ కోల్డ్ కార్వింగ్ (one-piece cold carving) తో ఈ డిజైన్ ప్రీమియంగా అనిపిస్తుంది. ఒప్పో ఇక్కడ ప్రతి చిన్న విషయంపై దృష్టి పెట్టింది. కంపోజిట్ షీట్లపై ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్కల్ప్టింగ్ చేయడం వల్ల హై-గ్లాస్ కెమెరా ప్లాట్‌ఫారమ్, స్కిన్-ఫ్రెండ్లీ కోటింగ్ లభించాయి. ఇవన్నీ ఫోన్‌ను ప్రీమియంగా, రోజువారీ వాడకానికి అనువుగా మారుస్తాయి.
మరో హైలైట్ డైనమిక్ 3D డెప్త్ టెక్నాలజీ, ఇది పైన్ చెట్ల సిల్హౌట్‌లతో కూడిన లేయర్డ్ కోటింగ్‌ను పరిచయం చేస్తుంది. ఇది డిజైన్‌కు విజువల్ డెప్త్, సూక్ష్మమైన కదలికను జోడిస్తుంది.

మన్నిక విషయంలో F33 Pro రోజువారీ ప్రాక్టికాలిటీపై ఎక్కువగా ఆధారపడింది. 8.29mm స్లిమ్ ప్రొఫైల్, 194g బరువు ఉన్నప్పటికీ, ఇది మందపాటి అక్రిలిక్-పాలికార్బోనేట్ బ్యాక్‌తో బలపరచబడింది. 6.57-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే 93.5% స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది, కానీ ఇది బలహీనంగా లేదు.
IP69K రేటింగ్ అంటే ఇది వర్షం, స్ప్లాషెస్, హై-ప్రెజర్ వాటర్, నీటిలో మునగడాన్ని కూడా తట్టుకోగలదు. ఇది 85°C వరకు వేడి నీటి ఎక్స్‌పోజర్‌తో సహా రియల్-వరల్డ్ కండిషన్స్‌లో టెస్ట్ చేయబడింది. వర్షాకాలంలో లేదా అవుట్‌డోర్ వాడకంలో ఇది మనకు భరోసానిస్తుంది.
అంతర్గతంగా 360-డిగ్రీ ఆర్మర్ బాడీ మరో రక్షణ పొరను జోడిస్తుంది. ముఖ్యమైన భాగాలు ఫోమ్, సిలికాన్‌తో కుషన్ చేయబడ్డాయి, ఇవి కింద పడినప్పుడు షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తాయి. మదర్‌బోర్డ్ AM04 అల్యూమినియం అలాయ్‌ను ఉపయోగిస్తుంది, ఇది ఏరోస్పేస్ కోసం అభివృద్ధి చేయబడింది, వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
72 నెలల ఫ్లూయెన్సీ ప్రొటెక్షన్ (Fluency Protection) ఒప్పో ఈ మోడల్‌లో కూడా అందిస్తోంది. ఇది ఆరు సంవత్సరాల జీవితకాలానికి హామీ ఇస్తుంది. ఫోన్ మేనేజర్ యాప్ ద్వారా డివైజ్‌ను ఫ్యాక్టరీ-ఫ్రెష్ స్టేట్‌కు రీస్టోర్ చేసే ఆప్షన్ కూడా ఉంది. టెస్టింగ్‌లో, ఫోన్ మల్టీ టాస్కింగ్‌లో చాలా స్థిరంగా, స్మూత్‌గా పనిచేసింది.
బ్యాటరీ, పర్ఫార్మెన్స్

OPPO F33 సిరీస్ 7000mAh బ్యాటరీతో వస్తుంది. 80W SUPERVOOC ఛార్జింగ్‌తో, ఇది త్వరగా, సమర్థంగా ఛార్జ్ అవుతుంది. కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో ఒక గంట కంటే ఎక్కువ వాట్సాప్ వీడియో కాల్స్ లేదా ఇన్‌స్టాగ్రామ్ బ్రౌజింగ్ చేయవచ్చు. దీనిలో 10W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా ఉంది... తద్వారా మీరు ఇతర యాక్సెసరీస్ లేదా మరొక ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు. ఇది బైపాస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ColorOS మ్యాజిక్
సాఫ్ట్‌వేర్ పరంగా ColorOS Gemini ఇంటిగ్రేషన్‌తో స్మార్ట్ ఇంటరాక్షన్‌లను తెస్తుంది. సెట్టింగ్స్, నోట్స్, క్యాలెండర్ వంటి యాప్‌లలో మీరు వాయిస్ కమాండ్స్‌ను ఉపయోగించవచ్చు. Circle to Search, AI Overview సమాచారాన్ని త్వరగా కనుగొనడంలో సహాయపడతాయి.
AI Ultra-Clear Documents ఫీచర్ డాక్యుమెంట్లను స్కాన్ చేసి, నీడలను తొలగించి, టెక్స్ట్‌ను మెరుగుపరిచి క్లియర్ PDFగా మారుస్తుంది. సెక్యూరిటీ కోసం OPPO O-Lock ఉంది. ఒకవేళ డివైజ్ పోతే కస్టమర్ సపోర్ట్ ద్వారా దానిని రిమోట్‌గా లాక్ చేయవచ్చు. ఫ్యాక్టరీ రీసెట్ తర్వాత కూడా పాస్‌వర్డ్ వెరిఫికేషన్ యాక్టివ్‌గా ఉంటుంది.

పర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 6360-MAX ప్రోసెసర్ (6nm) వాడారు. 8GB RAM, 630,000+ AnTuTu స్కోర్‌తో ఇది రోజువారీ పనులకు సరిపోతుంది. SuperCool Vapor Chamber సిస్టమ్ ఫోన్ వేడెక్కకుండా చూస్తుంది.
ఈ కలర్స్ లో అందుబాటులో..
ఒప్పో F33 Pro : మిస్టీ ఫారెస్ట్, స్టార్రీ బ్లూ, ప్యాషన్ రెడ్.
ఒప్పో F33 : ఫారెస్ట్ గ్రీన్, పెర్ల్ వైట్.
ధర, లభ్యత

OPPO F33 Pro: ప్రారంభ ధర INR 37,999, ఏప్రిల్ 23, 2026 నుండి లభిస్తుంది. ఇది ఆఫ్ లైన్ స్టోర్లతో పాటు ఒప్పో ఇ-స్టోర్, ప్లిఫ్ కార్ట్, అమెజాన్ లలో ఏప్రిల్ 23, 2026 నుండి అందుబాటులో ఉంటుంది. ఇక OPPO F33 ధర INR 31,999.. ఏప్రిల్ 29, 2026 నుండి అమ్మకాలు ప్రారంభమవుతాయి.
ముగింపు
సరికొత్త OPPO F33 సిరీస్ పూర్తిగా ప్రాక్టికాలిటీపై దృష్టి పెట్టింది. ప్రయాణాల్లో ఉండేవారికి కావాల్సిన పవర్‌ఫుల్ సెల్ఫీ కెమెరా, మన్నికను ఇది మిళితం చేస్తుంది. ఉత్పాదకత, ఫోటో ఎడిటింగ్ కోసం AI టూల్స్ లైఫ్ ని ఈజీ చేస్తాయి. 7000mAh బ్యాటరీ, పోటీ ధర (competitive price tag) దీనిని ఒక బలమైన ఆప్షన్‌గా మారుస్తాయి.


