సన్ ప్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పటికే అనేక పరిశోధనలు తేల్చాయి, అయినా మనం ఇప్పటికీ ఈ నూనెలనే వాడతాం. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయట. 

సన్‌ఫ్లవర్ ఆయిల్ మన దేశంలోని కోట్లాది మంది ప్రజల జీవితాల్లో భాగమైంది. దీని నాణ్యతపై ఇప్పటివరకు ఎవరికి పెద్ద సందేహాలు లేవు. ఇది చాలా తేలికైనది, చవకైనది అనే భావన ఉంది. దశాబ్దాలుగా ఇది అన్నింటికంటే ఆరోగ్యకరమైనది అనే భావన ఉంది. ప్రస్తుతం దీని వాడకంపై మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ హానికరం అని చెప్పడం కాదు... కొన్ని పరిశోధనల ప్రకారం నిరంతరం వాడడం మంచిది కాదు. శరీరానికి చేటు చేస్తుంది.. నిశ్శబ్దంగా ఒంట్లో కొవ్వుగా పేరుకుపోతుందని హెచ్చరిస్తున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎప్పుడు ప్రమాదకరం..

సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో PUFA కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతల వద్ద అస్థిరంగా ఉంటాయి. ఈ నూనెను ఎక్కువ సేపు మరగించడం, వేడిచేయడం, మళ్ళీమళ్ళీ వాడడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అయి హానికరంగా మారతాయి. ఎక్కువ కాలం ఇలాంటివి వాడడం వలన ఆరోగ్యాలు దెబ్బతింటాయి.

ఇది చాలా ప్రమాదకరం..

దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సన్‌ఫ్లవర్ నూనె వాడకం ఇతర నూనెలకంటే ఎక్కువగా ఉంది. దీని వాడకాన్ని ఇప్పటి వరకు ఎవరూ ప్రశ్నించలేదు. దశాబ్దాలుగా ఇది ప్రజల నిత్య జీవితంలో భాగమైంది. ఇటీవల కాలంలో రక్తపోటు, గుండె వ్యాధులు చాలా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అనారోగ్యకర ఆహార అలవాట్లతో పాటు వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, వ్యాయామం లేని జీవన విధానము, ఎక్కువగా తినడం వంటి అలవాట్లతో ఆరోగ్యం దెబ్బతింటున్నది.

ICMR, NIN సూచనలివే..

మే 2024 లో ICMR, NIN లు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాయి. కొవ్వులను చాలా తక్కువ మోతాదులోనే వాడాలని... మన శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను అవి లభించే పదార్థాల ద్వారా తీసుకోవాలని సూచించారు.. ఏ ఒక్కరకమైన నూనె కూడా సంపూర్ణం కాదు. సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో విటమిన్–ఈ, లభిస్తుంది. అవసరమైన ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఒకే రకమైన నూనెను వాడకుండా సరైన నిష్పత్తిలో మిశ్రమం చేసిన నూనెను వాడడం ఆరోగ్యకరం.

ప్రస్తుతం మార్కెట్లో సఫోలా టోటల్, జెమిని, ఫార్చూన్, హార్టివా వంటి మిశ్రమ నూనెలు (మల్టీ సోర్సెస్) లభిస్తున్నాయి. వీటి రుచికూడా గణనీయంగా ఉంటుంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ మనకి శత్రువు కాదు. ఆరోగ్యం కోసం వివిధ పరిశోధనా సంస్థలు పేర్కొన్న నిష్పత్తిలో కలిసిన మిశ్రమ నూనెలు (మల్టీ సోర్సెస్) మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.