సుజుకి నుండి కొత్త 125సిసి బిఎస్ 6 ఇంజన్ బైక్...

భారతదేశంలో సుజుకి మోటార్ సైకిల్ ఇండియా బిఎస్ 6 ఇంజన్ తో సుజుకి యాక్సెస్ 125ను వెల్లడించింది. కొత్త బిఎస్ 6 సుజుకి యాక్సెస్ 125 ధరలను జనవరి 2020 లో వెల్లడించనున్నారు.

suzuki launches new bs6 access 125 cc bike

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌ఎమ్‌ఐపిఎల్) తన మొదటి భారత్ స్టేజ్ 6 (బిఎస్ 6) కంప్లైంట్ మోడల్  సుజుకి యాక్సెస్ 125 ను విడుదల చేసింది. ఇది బిఎస్ 4 నుండి బిఎస్ 6 ప్రమాణాలకు కంపెనీ మారిందని తెలిపింది. సుజుకి యాక్సెస్ 125 బిఎస్ 6 లో ఎకో అసిస్ట్ ఇల్యూమినేషన్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఇంకా కొత్త ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.

also read  పెట్రోల్, ఛార్జింగ్ అవసరం లేకుండా నడిచే కొత్త కార్


దీనికి 124 సిసి సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఇప్పుడు బిఎస్ 6 కంప్లైంట్, ఇది 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 బిహెచ్‌పిని, పీక్ టార్క్ అవుట్పుట్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.2 ఎన్ఎమ్ నుండి 10 ఎన్‌ఎమ్‌లకు పడిపోతుంది. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కొయిచిరో హిరావ్ మాట్లాడుతూ, "ఏప్రిల్ 1 వ తేదీ కంటే ముందే మా మొదటి బిఎస్ 6 ఉత్పత్తిని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము.

suzuki launches new bs6 access 125 cc bike

ఇప్పుడు ఒక దశాబ్దానికి పైగా, సుజుకి యాక్సెస్ 125 ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్లలో ఒకటిగా ఉంది. ఈ బైకు 'కామ్ పీతా హై' గా ప్రసిద్ధ ట్యాగ్‌లైన్‌కు ప్రసిద్ది చెందింది. ఆల్-న్యూ బిఎస్ 6 కంప్లైంట్ సుజుకి యాక్సెస్ 125 ను భారతీయ వినియోగదారులు మరింత ఆరాధిస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. ఆల్-న్యూ యాక్సెస్ 125 కొత్త ఫీచర్లతో లోడ్ చేశారు. ఇది వినియోగదారులకు ఓవర్-ఆల్ రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. "

also read మార్కెట్లోకి రెండు కొత్త 160 సిసి స్కూటర్లు...

ఎకో అసిస్ట్ ఇల్యూమినేషన్ ఫీచర్ రైడర్ కు మంచి మైలేజ్ ఇస్తుంది. సుజుకి యాక్సెస్ 125  బిఎస్ 6 స్పెషల్ ఎడిషన్ మోడల్ లో మొబైల్ ఫోన్‌ ఛార్జ్ చేయడానికి యుఎస్‌బి సాకెట్‌ ఉంటుంది. కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లో రాత్రిపూట ప్రయాణం చేయడానికి మెరుగైన లైట్ విజన్ ఉపయోగకరంగా ఉంటుంది అని సుజుకి చెప్పారు. సుజుకి యాక్సెస్ 125 భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 125 సిసి స్కూటర్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios