మార్కెట్లోకి రెండు కొత్త 160 సిసి స్కూటర్లు...
వెస్పా, అప్రిలియా స్కూటర్లు ఇప్పుడు బిఎస్ 6 ప్రమాణాలతో 160 సిసి ఇంజిన్ తో రానుంది. ఇంతకు ముందు కంటే ఎక్కువ శక్తి , ఇంకా ధరలో కూడా పెరుగుదల ఉంటుంది.ఇది పాత వెర్షన్ కంటే ఇప్పుడు ఇది రూ.10వేలు ఖరీదైనది. కొత్త బిఎస్ 6 వెస్పా 150 ఎస్ఎక్స్ఎల్ ధర రూ. 91,492 (ఎక్స్-షోరూమ్ పూణే) నుండి ప్రారంభమవుతుంది.
పియాజియో ఇండియా దేశంలో అప్రిలియా, వెస్పా స్కూటర్ల బిఎస్ 6 కంప్లైంట్ వెర్షన్లను విడుదల చేసింది. ఈ స్కూటర్లు ఇప్పుడు కొత్త 160 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్, ఫ్యుయెల్ ఇంజెషన్ తో వస్తుంది.కొత్త పవర్‌ట్రెయిన్‌తో అప్రిలియా ఎస్‌ఆర్ 150 ను అప్రిలియా ఎస్‌ఆర్ 160 గా రీబ్యాగ్ చేశారు. కొత్త అప్రిలియా ఎస్‌ఆర్ 160 ధర ఇప్పుడు రూ. 85,431 నుంచి మొదలవుతుంది.
also read కియా సెల్టోస్ కార్ల ధరలు పెంపు...
ఇది పాత వెర్షన్ కంటే ఇప్పుడు ఇది రూ.10వేలు ఖరీదైనది. కొత్త బిఎస్ 6 వెస్పా 150 ఎస్ఎక్స్ఎల్ ధర రూ. 91,492 (ఎక్స్-షోరూమ్ పూణే) నుండి ప్రారంభమవుతుంది.వెస్పా, అప్రిలియా బిఎస్ 6 గురించి పియాజియో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ డియెగో గ్రాఫి మాట్లాడుతూ, " గడువుకు ముందే మా వెస్పా, అప్రిలియా స్కూటర్లను బిఎస్ 6 ప్రమాణాలలో లాంచ్ చేయడాన్ని మేము సంతోషిస్తున్నాము." అని అన్నారు.
ద్విచక్ర వాహనాల వ్యాపార హెడ్ ఆశిష్ యఖ్మి మాట్లాడుతూ, "ప్రస్తుతం వెస్పా, అప్రిలియా బ్రాండ్ల స్కూటర్లలో బిఎస్ 6 టెక్నాలజీని విజయవంతంగా విలీనం చేసాము. మా అప్‌గ్రేడ్ శ్రేణి స్కూటర్లు భారతదేశంలోని అన్నీ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి.
also read మరో నాలుగేళ్లకు హ్యుండాయ్ మోటార్స్ ప్లాన్ ఇదీ
కొత్త 160 సిసి అప్రిలియా బైక్ బిఎస్ 4 మోడళ్ 154.8 సిసి సింగిల్ సిలిండర్ బైకును భర్తీ చేస్తుంది. ఇది గరిష్టంగా10.8 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది, అలాగే కొత్త సంవత్సరానికి ఈ మోడళ్ లుక్కింగ్ లో, గ్రాఫిక్స్ లేదా డెకాల్స్ లో ఎటువంటి మార్పులు లేవు. కొత్త 160 సిసి వెస్పా, అప్రిలియా స్కూటర్లు డీలర్‌షిప్ వద్ద లభిస్తాయి. కంపెనీ త్వరలోనే 125 సిసి స్కూటర్ ను జనవరి 2020లో ప్రవేశపెట్టనుంది. ఇందులో వెస్పా తో పాటు ఏప్రిల్లిస్ ఎస్ఆర్ 125 కూడా ఉంది.