కియా సెల్టోస్ కార్ల ధరలు పెంపు...

కియా సెల్టోస్  1 జనవరి 2020 నుండి కార్ల ధరలలో పెరుగుదల ఉంటుందని డీలర్‌షిప్‌లకు పంపిన లేఖలో పేర్కొంది. వచ్చే ఏడాది కార్ల డెలివరీ తీసుకునే వినియోగదారులు కాంపాక్ట్ ఎస్‌యూవీపై ప్రీమియం ధర చెల్లించాలి.

kia motros india ready to hike its cars price from jan 2020

కియా మోటార్స్ ఇండియా 1 జనవరి  2020  నుండి సెల్టోస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలను పెంచనుంది. ప్రస్తుత ధరల కంటే "గణనీయమైన" గా పేర్కొన్న ధరల పెరుగుదల గురించి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లకు వాహన తయారీదారి ఒక లేఖ పంపారు.కియా సెల్టోస్ కారు ప్రస్తుతం 9.69 లక్షల నుండి 16.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఇండియా) మధ్య ధరను కలిగి ఉంది.

also read మరో నాలుగేళ్లకు హ్యుండాయ్ మోటార్స్ ప్లాన్ ఇదీ

31 డిసెంబర్ 2019 లోపు తమ వాహనాలను డెలివరీ పొందే కస్టమర్లు ఈ ధరల క్రింద లాక్ చేయబడతారు. అయితే, సెల్టోస్‌ను బుక్ చేసుకొని వచ్చే ఏడాది కార్ డెలివరీ చేయాల్సిన వినియోగదారులు ప్రీమియం చెల్లించాలి. కియా సెల్టోస్ ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించినప్పటి నుండి గొప్ప  ఆరంభం ప్రారంభమైంది. కంపెనీ కాంపాక్ట్ ఎస్‌యూవీ  కార్లు 80,000 యూనిట్ల బుకింగ్‌లను నమోదు చేసింది. 

kia motros india ready to hike its cars price from jan 2020

కియా మోటార్స్ భారతదేశంలో ఐదవ అతిపెద్ద కార్ల తయారీదారిగా అవతరించడానికి కారణం దాని ఆకర్షణీయమైన ఆఫర్ ధర. ఈ మోడల్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్  కేంద్రంగా ఉన్న అనంతపురం వద్ద ఉత్పత్తి చేయబడుతుంది. అక్కడి నుండి అనేక మార్కెట్లకు ఎగుమతి చేస్తారు.

also read 2019 Round up: విద్యుత్ వెహికల్స్ ‘ఫేమ్’లో టూ వీలర్స్‌కే ప్రాధాన్యం


ధరల పెరుగుదలను మినహాయించి, కొత్త సంవత్సరానికి కియా సెల్టోస్‌లో పెద్ద మార్పులు  ఏం ఉండవు. ఈ ఎస్‌యూవీ కారులో 1.5-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు 1.4 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటారుతో అందిస్తున్నారు. అన్ని ఇంజన్లు BS-6 కంప్లైంట్. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, ఐవిటి ఆటోమేటిక్, సివిటి మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్ ఉన్నాయి. మోడల్ రెండు ట్రిమ్ లెవెల్స్ లో అందిస్తున్నారు, టెక్ లైన్ మరియు జిటి లైన్.

 కియా ఇండియా ఇప్పుడు కార్నివాల్ ఎంపివి తన రెండవ కారును భారతదేశంలో ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. టొయోటా ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, రాబోయే టాటా గ్రావిటాస్ కు పోటీగా కంపెనీ తీసుకుంటుంది. కియా కార్నివాల్ 2020 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టనుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios