న్యూఢిల్లీః దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ ‘హ్యుండాయ్ మోటార్స్ ఇండియా` భారత్లోని తన ఉత్పాదక కేంద్రాలపై నూతన ప్రణాళికలు రచించింది. వచ్చే కొన్నేళ్ల పాటు దేశీయ మార్కెట్ తోపాటు విదేశాలకు ఎగుమతి చేయడానికి అవసరమైన కార్ల ఉత్పత్తిపైనే దృష్టి సారించాలని నిర్ణయించింది. 

also read 2019 Round up: విద్యుత్ వెహికల్స్ ‘ఫేమ్’లో టూ వీలర్స్‌కే ప్రాధాన్యం

చెన్నైలోని ప్రొడక్షన్ యూనిట్ నుంచే దేశీయంగా 98 శాతం ఉత్పత్తులు సాగిస్తున్నది. అటుపై అదనపు వాహనాల ఉత్పత్తికి గల ప్రణాళికలనూ చెన్నై ప్లాంట్ నుంచే అమలు చేయాలని భావిస్తున్నది. సహచర సంస్థ కియా మోటార్స్తో అనుసంధానమై మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కార్ల ఉత్పత్తి అవకాశాలను కొట్టి పారేసింది. 

తొలుత వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడంపైనే వచ్చే కొన్నేళ్ల పాటు దృష్టి సారించి నూతన ఉత్పాదక యూనిట్ ఏర్పాటు చేయాలన్న అంశాన్ని హ్యుండాయ్ మోటార్స్ పరిశీలిస్తోంది. హ్యుండాయ్ మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ ఎస్ఎస్ కిమ్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంగతి చెప్పారు. 

స్వల్ప కాల వ్యవధి మేరకు వచ్చే మూడు, నాలుగేళ్లు దేశీయంగానూ, విదేశాలకు వాహనాల ఎగుమతికి అనుగుణంగా ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలని నిర్ణయించామన్నారు. దేశీయంగా డిమాండ్ తగ్గిపోవడంతోపాటు విదేశాల నుంచి ఎగుమతులకు డిమాండ్ ఏర్పడింది. మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా రీజియన్ల నుంచి ఎక్కువగా తమ కార్లకు డిమాండ్ వచ్చిందని కిమ్ తెలిపారు. 

వివిధ దేశాల ప్రభుత్వాలు తమ భూభాగంపైనే ఉత్పత్తి చేయాలని హ్యుండాయ్ సంస్థను కోరుతున్నాయని కిమ్ చెప్పారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉత్పత్తి చేసిన విడి భాగాలను ఇతర దేశాల్లో అసెంబ్లింగ్ చేసి విక్రయిస్తామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,03,300 కార్లను విదేశాలకు ఎగుమతి చేశామన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది 19.26 శాతం పురోగతి నమోదు చేశామని కిమ్ వివరించారు.

also read మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్...ఫీచర్లు అదుర్స్!

ఆఫ్రికా, మిడిల్ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లోని 90కి పైగా దేశాలకు తమ కంపెనీ కార్లను ఎగుమతి చేశామని హ్యుండాయ్ సీఈఓ కిమ్ తెలిపారు. తమ అనుబంధ సంస్థ కియా మోటార్స్‌తో ప్రస్తుతానికి ప్రొడక్షన్ షేరింగ్ ఆలోచన లేదన్నారు. 

దీనికి బదులు స్మార్ట్ ప్రొడక్షన్ ప్రణాళికలను ప్రవేశపెడతామని చెప్పారు. ఏటా చెన్నైలోని ప్లాట్లు సగటున 7.5 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేస్తుందన్నారు. చెన్నై ప్లాంట్లో వసతులను 98 శాతం ఉపయోగించుకోనున్నామన్నారు. సమీప భవిష్యత్ లో ఉత్పత్తిని 8 లక్షల కార్లకు పెంచాలన్నదే తమ వ్యూహం అని కిమ్ వివరించారు.