ముంబై: ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ (హెచ్ఎంఎస్ఎల్) ఆధ్వర్యంలో రూపొందించిన ‘బీఎస్‌-6’ మోడల్ యాక్టివా ద్విచక్రవాహనాల అమ్మకాల్లో రికార్డు నెలకొల్పింది. తాజాగా లక్ష యూనిట్ల మైలురాయి అధిగమించినట్లు హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. 

also read ఆటో దిగ్గజాలు ఆనంద్ వేణు శ్రీనివాస్‌లకు ‘భూషణ్‘.. 9 మందికి పద్మ శ్రీ

2019 సెప్టెంబర్‌లో హోండా తమ సంస్థ నుంచి తొలి బీఎస్‌-6 స్కూటర్ యాక్టీవా 125, ఆ తర్వాత ఎస్పీ 125 యాక్టీవా.. అనంతరం ఈ ఏడాది ఆరంభంలో యాక్టివా 6జీలను విపణిలోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. బీఎస్‌-6 ప్రమాణాలతో రూపొందించిన అధునాతన ఇంజిన్లతో ఈ మూడు రకాల ద్విచక్రవాహనాల సంస్థ మార్కెట్‌కు పరిచయం చేసింది. 

ఈ బీఎస్‌ 6 వాహనాలను విడుదల చేసినప్పటి నుంచి కేవలం నాలుగు నెలల్లో లక్ష యూనిట్లు అమ్మినట్లు హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ తెలిపింది.  ఈ ఏడాది ఏప్రిల్‌ కల్లా బీఎస్‌-6 వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయాలని కే్ంద్ర ప్రభుత్వం ఇదివరకే ఆదేశించింది.

also read రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రెండు కొత్త బిఎస్ 6 బైకులు...

దీంతో ఆ గడువుకు ముందే బీఎస్‌-6 వాహనాలను మార్కెట్‌లో అందుబాటులో ఉంచేందుకు హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ సిద్ధమైంది. ఈ వాహనాలు కేవలం పనితీరులోనే కాకుండా మైలేజీ విషయంలోనూ మంచి ఫలితాల్నిస్తాయని సంస్థ తెలిపింది. కేవలం పనితీరులోనే కాకుండా మైలేజీ విషయంలోనూ సత్ఫలితాలనిస్తాయని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ పేర్కొంది.