రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రెండు కొత్త బిఎస్ 6 బైకులు...
భారత్ స్టేజ్ 6 (బిఎస్ 6) కంప్లైంట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 ధరలను అధికారికంగా వెల్లడించలేదు, కాని ఆనధికారికంగా దాని వివరాలు వెళ్లడయ్యాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బిఎస్ 6 ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 లకు బుకింగ్లను ఇండియాలో ప్రారంభించింది అలాగే దీని ధరల వివరాలను కూడా వెల్లడించింది.బిఎస్ 6 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ ధర రూ. 2.65 లక్షలు కాగా, బిఎస్ 6 కాంటినెంటల్ జిటి ధర రూ. 2.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)నిర్ణయించింది.
భారత్ స్టేజ్ 6 (బిఎస్ 6) కంప్లైంట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 ధరలను అధికారికంగా వెల్లడించలేదు, కాని ఆనధికారికంగా దాని వివరాలు వెళ్లడయ్యాయి.బిఎస్ 6 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ ధర 2.65 లక్షలతో ప్రారంభమవుతుండగా, బిఎస్ 6 కాంటినెంటల్ జిటి ధర 2.80 లక్షలతో ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా).
also read మారుతి సుజుకి నుండి కొత్త బిఎస్-6 కారు లాంచ్...
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్సెప్టర్, కాంటినెంటల్ జిటి టాప్-స్పెసిఫికేషన్ క్రోమ్ వేరియంట్ల ధర ₹ 2.85 లక్షలు మరియు ₹ 3.01 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఇండియా)లభిస్తుంది.ఈ కొత్త ధరలు అవుట్‌గోయింగ్ బిఎస్ 4 మోడళ్ల ధరల కంటే సుమారు రూ.9,000 ఎక్కువ.
భారతదేశంలోని కొన్ని మెట్రో నగరాల్లోని డీలర్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల బుకింగ్స్ ప్రారంభించారు.రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 బైక్ 649 సిసి ఇంజన్, పారలెల్-ట్విన్, ఎయిర్ ఇంకా ఆయిల్-కూల్డ్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 47 బిహెచ్‌పి, 7,250 ఆర్‌పిఎమ్ అందిస్తుంది. 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సిసి గల ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ బైక్ రెండూ ఒకే రకమైన ఇంజిన్‌తో వస్తుంది. స్లిక్ షీఫ్టింగ్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ దీనికి ఉంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలాదు.బిఎస్ 6 కంప్లైంట్ 650 సిసి బైక్స్ రెండు డ్రైవ్‌ట్రెయిన్‌లో పెద్దగా మార్పులు ఏమి ఉండకపోవచ్చు. ఇసియు ఇంకా థొరెటల్ బాడీలలో చిన్న మార్పులు ఉంటుండొచ్చు ఇంకా టార్క్, పవర్ అవుట్‌పుట్‌లలో కాస్త చిన్న మార్పులు ఉంటాయి.
also read కియా మోటార్స్ కొత్త కారు రికార్డు: ఒక్కరోజులోనే 1410 ఆర్డర్లు!
రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ 650 సిసి బైకులకు కొన్ని అసెసోరిస్ అందిస్తుంది. వీటిలో కొన్ని రూ.600 ధర గల హ్యాండిల్ బార్ బ్రేస్-ప్యాడ్, రూ. 850 ఫోర్క్ గైటర్స్ , రూ. 2,900 విలువ గల ఇంజిన్ గార్డ్లు, షార్ట్ ఫ్లైస్క్రీన్ ధర రూ.1,500, ఫ్యానియర్స్ మౌంటు కిట్ ధర రూ.1,600, సాఫ్ట్ ఫ్యాన్నీర్స్ ధర 6,000 అందిస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 సింగిల్ సీటు ధర 3,200, కౌల్‌తో పాటు 2,500 ధర ఉంటుంది. ఇంటర్సెప్టర్ 650 బైకు టూరింగ్ సీటును పొందుతుంది. ఇది దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు సౌకర్యవంతంగా ఉండేలా సహాయపడుతుంది.