యూత్ కోసం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్... హై స్పీడ్, లేటెస్ట్ ఫీచర్లతో...
అథర్ 450 ఎక్స్ స్కూటర్ అథర్ ఎనర్జీ నుండి వచ్చిన కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ప్రస్తుత అథర్ 450 స్కూటర్ కన్నా ఎక్కువ ఫీచర్లు, మెరుగైన స్పెసిఫికేషన్లను దీనిలో ఉన్నాయి.
అథర్ ఎనర్జీ ప్రైవేట్. లిమిటెడ్ ఇది ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనల తయారీ సంస్థ. తరుణ్ మెహతా, స్వాప్నిల్ జైన్ 2013 లో దీనిని స్థాపించారు.ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ అథర్ 450లను తయారు చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథర్ గ్రిడ్‌ను కూడా ఏర్పాటు చేసింది.
also read ఆన్‌లైన్ ద్వారా కార్లను కూడా కొనుగోలు చేయవచ్చు... ఎలా అంటే...?
అథర్ 450 ఎక్స్ స్కూటర్ అథర్ ఎనర్జీ నుండి వచ్చిన కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ప్రస్తుత అథర్ 450 స్కూటర్ కన్నా ఎక్కువ ఫీచర్లు, మెరుగైన స్పెసిఫికేషన్లను దీనిలో ఉన్నాయి.అథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ కి ప్రీమియం, అప్‌డేటెడ్ మోడల్ అయిన అథర్ 450 ఎక్స్ 2020 జనవరి 28 న ప్రారంభం కానుంది.
కొత్త అథర్ 450 ఎక్స్ స్కూటర్ ప్రస్తుతం అమ్మకంలో ఉన్న అథర్ 450 కన్నా లేటెస్ట్ , అప్ డేట్ ఫీచర్లు ఇంకా అధ్బుతమైన ఫీచర్స్ కూడా ఉంటాయని భావిస్తున్నారు.అథర్ 450 ఎక్స్ స్కూటర్ చెన్నై, అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్, పూణే, బెంగళూరు, ఢిల్లీ ఇంకా కోయంబత్తూర్ అంతటా లాంచ్ చేయనున్నారు.
ఇప్పటికే అథర్ 450 స్కూటర్ కొనుగోలు చేసిన యజమానులు అలాగే ఇతరుల నుండి అప్ డేట్ మోడల్ అయిన అథర్ 450 ఎక్స్ కోసం ప్రీ-ఆర్డర్‌లను ఆథర్ ఎనర్జీ కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది.ఆథర్ ఎనర్జీ సంస్థ ఇప్పటికే ఆథర్ 450 ఎక్స్ స్కూటర్ టీజర్ వీడియోలను విడుదల చేసింది. కొత్త ప్రీమియం స్కూటర్ వివిధ రంగులలో లభ్యం కానుంది.
also read ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు... చైనా కంపెనీతో భారీ ఒప్పొందాలు...
ప్రస్తుత అథర్ 450 తెలుపు రంగులో మాత్రమే లభిస్తుంది. అథర్ 450 ఇప్పటికే ఒక మంచి ఆకట్టుకునే ఉత్పత్తిగా నిలిచింది. భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమలో ఒక బెంచ్ మార్కును, ఒక గొప్ప పనితీరును ఇంకా హైటెక్ ఫీచర్లను అందిస్తుంది. అథర్ 450 స్కూటర్ 2.4 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ, బిఎల్‌డిసి మోటారుని దీనికి బిగించారు. ఇది గరిష్టంగా 5.4 కిలోవాట్ల శక్తి తో 20.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను అందిస్తుంది.
కేవలం 3.9 సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని ఆథర్ 450 ఎక్స్ అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కి.మీ. ఒక్కసారి చార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. అలాగే రిమోట్ డయాగ్నస్టిక్స్, ఓవర్-ది-ఎయిర్ అప్ డేట్లతో సహా స్మార్ట్-కనెక్ట్ చేయబడిన ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో అమ్మకానికి ఉన్న ఉత్తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో అథర్ 450 ఒకటి.