ఆన్‌లైన్‌ ద్వారా కార్లను కూడా కొనుగోలు చేయవచ్చు... ఎలా అంటే...?

దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా దేశీయంగా ఆన్ లైన్ సేల్స్ అందుబాటులోకి తెచ్చింది. ‘క్లిక్ టు బై’ విధానంతో తీసుకువచ్చిన ఈ పద్దతిని ప్రయోగాత్మకంగా ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలోని కొన్ని డీలర్‌షిప్‌ల్లో ప్రారంభించింది. 

Hyundai launches online platform to sell cars in india

న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువుల ఆన్ లైన్ విక్రయాలపై దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ ‘హ్యుండాయ్ మోటార్స్’ స్ఫూర్తి పొందింది. తాజాగా ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు సాగిస్తామని హ్యుండాయ్ మోటార్స్ ఇండియా చెబుతోంది. 

సంప్రదాయ విక్రయశాలలతోపాటు ‘క్లిక్ టు బై’ సాయంతో ఆన్‌లైన్‌లో తమ కార్లను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. నూతన తరం వినియోగదారుల కోసమే ప్రత్యేకించి టెక్కీ కుర్రాళ్ల కోసం ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తీసుకొచ్చామని హ్యుండాయ్ మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ ఎస్ఎస్ కిమ్ తెలిపారు.

also read ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు... చైనా కంపెనీతో భారీ ఒప్పొందాలు...

దేశ రాజధాని ప్రాంతంతోపాటు ఢిల్లీ పరిధిలో ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద కొంత మంది డీలర్ల వద్ద ఈ ప్రాజెక్టును హ్యుండాయ్ మోటార్స్ ప్రారంభించింది. అన్ని మోడల్ కార్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచామని వెల్లడించింది. హ్యుండాయ్ మోటార్స్ తన కార్ల విక్రయాల్లో పారదర్శకత సాధించడానికే ఆన్‌లైన్ విక్రయాల విధానాన్ని ముందుకు తీసుకొచ్చామని తెలిపింది.

Hyundai launches online platform to sell cars in india

కంపెనీ డీలర్ల కోసం హ్యుండాయ్ మోటార్స్ తన వెబ్‌సైట్‌లో అన్ని రకాల మోడళ్ల కోసం ప్రత్యేక చానెల్ ఏర్పాటు చేసింది. హ్యుండాయ్ మోటార్స్ మాదిరిగానే ఇతర ఆటోమొబైల్ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ఆన్‪లైన్‌లో విక్రయానికి పెట్టాయి. స్నాప్ డీల్ సంస్థతో ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్స్ ఒప్పందం కుదుర్చుకున్నది. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా.. ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ‘ఫ్లిప్ కార్ట్’ బంధం ఏర్పాటు చేసుకున్నది. 

also read హోండా నుండి మరో కొత్త మోడల్ బైకు...ధర ఎంతో తెలుసా...

జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ‘మెర్సిడెజ్-బెంజ్’ కూడా ఒక ఆన్ లైన్ వేదికను ఏర్పాటు చేసుకున్నది. ‘మెర్సిడెజ్ మీ కనెక్ట్’ అనే పేరుతో భారతదేశంలోని ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్‌తో అక్టోబర్ నెలలో వినియోగదారులకు ఆన్ లైన్ సేల్స్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇతర సంస్థలు కూడా కొన్నేళ్ల క్రితం ఆన్ లైన్ సేల్స్ కోసం ఏర్పాట్లు చేసుకున్నా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. 

గిన్నిస్ బుక్స్ రికార్డులోకి ‘హ్యుండాయ్’ కొనా 
హ్యుండాయ్ మోటార్‌ ఇండియా దేశంలోనే సుదూర శ్రేణీ విద్యుత్‌ ఎస్‌యూవీ ‘కొనా‘ గిన్నిస్‌ వాల్డ్‌ రికార్డులో నమోదైంది. భారత్‌లో తయారైన ఈ కారు టిబెట్‌లోని 5,731 మీటర్ల ఎత్తుగల సవుల పాస్‌ శిఖారాన్ని నిర్విరామంగా ఎక్కడంతో ఈ గుర్తింపు లభించినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డు దక్కడం తమకు చాలా సంతోషంగా ఉందని హ్యుండాయ్ మోటార్‌ ఇండియా ఎండీ కం సీఈఒ ఎస్‌ఎస్‌ కిమ్‌ పేర్కొన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios