ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు... చైనా కంపెనీతో భారీ ఒప్పొందాలు...
నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం విదేశీ ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలతో ఒప్పొందాలను కుదుర్చుకుంటుంది.
కేంద్రప్రభుత్వం ఆటోమొబైల్ రంగంపై దృష్టిసారించింది. నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం విదేశీ ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థలతో ఒప్పొందాలను కుదుర్చుకుంటుంది.
ఇప్పటికే జీఎస్టీ, ఆర్ధిక మాధ్యం ఇలా రకరకలా కారణాలతో కుదేలవుతున్న ఆటోమొబైల్ రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.
also read హోండా నుండి మరో కొత్త మోడల్ బైకు...ధర ఎంతో తెలుసా...
వాయికాలుష్యాన్ని తగ్గించేలా వ్యాపారస్థుల్ని ప్రోత్సహిస్తూ జీఎస్టీ రిటర్న్ ల విధానాన్ని మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారస్తుల టర్నోవర్ ను రూ.20 లక్షలు ఉండగా రూ.40 లక్షలకు పెంచింది. ఎలక్ట్రికల్ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులు చెల్లించే వడ్డీపై రూ.1.5లక్షల వరకు రాయితీని కల్పించింది.
ఓ వైపు ఆటోమొబైల్ నష్టాల్లో కూరుకుపోతున్నా ఎస్ యూవీ వాహనాల మోడళ్లకు డిమాండ్ భారీగా ఉంది. ఎస్ యూవీ, కాంపాక్ట్ ఎస్ యూవీ, మినీ ఎస్ యూవీ మోడళ్లకు చెందిన వాహనాలు 2018 సెప్టెంబర్ నాటికి యుటిలిటీ వెహికల్స్ 77,380 వాహనాలు అమ్ముడుపోగా 2019లో 81,625 వాహనాలు అమ్ముడుపోయాయి.
also read బజాజ్ ఆటో , ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ విలీనం... మార్కెట్లోకి కొత్త బైకులు...
దీంతో ఎస్ యూవీపై వాహనాలపై కన్నేసిన కేంద్రం ... స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్ యూవీ) మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ను భారత్ లో స్థాపించేలా చర్యలు తీసుకుంటుంది. భారీ అమ్మకాలతో రికార్డ్ సృష్టించిన చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ గ్రేట్ వాల్ మోటార్స్ ను ఇండియాలో స్థాపించేలా ఒప్పొందాన్ని కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా ఆ సంస్థ గ్లోబల్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ లియూ షియాంగ్ షాంగ్ మాట్లాడుతూ గ్రేట్ వాల్ మోటార్స్ ను ఇండియాలో స్థాపించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. 200మిలియన్ల నుంచి 300మిలియన్ల పెట్టుబడితో డైరక్ట్ గా ఇండైరక్ట్ గా డిమాండ్ అండ్ సప్లయ్ ఆధారంగా ఉద్యోగాలు, లాభాల ఆధారంగా ఆయా ప్రభుత్వాలకు ట్యాక్స్ లను పే చేస్తామని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆటోషోలో భాగంగా తెలిపింది.