Asianet News TeluguAsianet News Telugu

మార్చి 6న విపణిలోకి టిగువాన్.. అదే రోజు బుకింగ్స్ షురూ

జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ నూతన తరం టిగువాన్ ఆల్ స్పేస్ మోడల్ కారును వచ్చేనెల ఆరో తేదీన ఆవిష్కరించనున్నది.

Volkswagen Tiguan Allspace launch on March 6
Author
New Delhi, First Published Feb 23, 2020, 12:43 PM IST


న్యూఢిల్లీ: జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్ వ్యాగన్ నూతన తరం టిగువాన్ ఆల్ స్పేస్ మోడల్ కారును వచ్చేనెల ఆరో తేదీన ఆవిష్కరించనున్నది. వోక్స్ వ్యాగన్ ఈ నెల ఐదో తేదీన ఢిల్లీ శివార్లలో జరిగిన ఆటో ఎక్స్ పోలో టైగున్, టీ-రాక్, ఐడీ, క్రాజ్ ఈవీ కాన్సెప్ట్ మోడల్ కారుతోపాటు టిగువాన్ ఆల్ స్పేస్ కారునూ ఆవిష్కరించింది. 

ఏడు సీట్ల ఈ ప్రీమియం ఎస్ యూవీ కార్ల కొనుగోలుకు మార్చి ఆరో తేదీ నుంచే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న న్యూ టిగువాన్ ఆల్ స్పేస్ 2.0 లీటర్లు, టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ 190 బీహెచ్పీ విడుదల సామర్థ్యం కలిగి ఉంటుంది. 

Also read:బిగ్ రిలీఫ్: ఏజీఆర్ డ్యూస్ కోసం ‘స్ట్రెస్ ఫండ్’.. వొడాఫోన్‌కు బెనిఫిట్

టిగువాన్ కారు 7-స్పీడ్ ఆటోమేటిక్ డీఎస్జీ ట్రాన్సిమిషన్ సౌకర్యం ఉంది. ప్రీమియం ఎస్‌యూవీ కారులో 4 మోషన్ ఏడబ్ల్యూడీ సిస్టమ్ ఉంది. న్యూ వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఆల్ స్పేస్ కారులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, రూఫ్ రైల్స్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ జత కలిశాయి. 

7-సీట్ల ప్రీమియం ఎస్‌యూవీ ఇంటిరీరియర్ వియన్నా లెదర్ సీట్లు, యాక్టివ్ ఇన్ఫో డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్యాబిన్‌లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 3-జోన్ క్లైమాట్రోనిక్ ఏసీ, పనోరమిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు జత కలిశాయి. 

సేఫ్టీ ఫీచర్లకు సంబంధించి టిగువాన్ ఆల్ స్పేస్ మోడల్ కారులో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఎలక్ట్రానిక్ స్టేబిలైజేషన్ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం (టీపీఎంఎస్), రివర్స్ పార్కింగ్ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి. 

ప్రస్తుతం ఐదు సీట్ల వోక్స్ వ్యాగన్ టిగువాన్ కారు ధర రూ.28 లక్షలు పలుకుతున్నది. తాజాగా ఆధునీకరించిన టిగువాన్ కారు ధర రూ.35 లక్షల వరకు పలుకవచ్చునని అంచనా వేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios