Asianet News TeluguAsianet News Telugu

ఫుల్ డిమాండ్: సెప్టెంబర్’19 కల్లా‘జావా’ ప్రీ-సేల్స్ క్లియర్

ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘జావా’ సరికొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన ‘జావా42’ మోడల్ బైక్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీంతో ఈ నెల 25 నుంచే ఆన్ లైన్ బుకింగ్స్ నిలిపివేసినట్లు జావా మోటారు సైకిల్స్ ప్రకటించింది. ఈ సంస్థ భారతదేశం అంతటా 10 డీలర్ షిప్ లు కలిగి ఉంది. 
 

Jawa Motorcycles Sold Out Till September 2019, Online Bookings Closed
Author
New Delhi, First Published Dec 28, 2018, 11:30 AM IST

ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘జావా’ సరికొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన ‘జావా42’ మోడల్ బైక్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. దీంతో ఈ నెల 25 నుంచే ఆన్ లైన్ బుకింగ్స్ నిలిపివేసినట్లు జావా మోటారు సైకిల్స్ ప్రకటించింది. ఈ సంస్థ భారతదేశం అంతటా 10 డీలర్ షిప్ లు కలిగి ఉంది. 

నాలుగు పుణెలో, మూడు బెంగళూరులో, ఐదు ఢిల్లీలో ఉన్నాయి. జావా 42 మోడల్ బైక్ ప్రజాదరణ పొందడానికి మరో కారణం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, బుల్లెట్ ఎలెక్ట్రా, క్లాసిక్ 350 మోడల్ బైకులకు ఇది సవాల్ విసరడమే. 

క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకుడు అనుపమ్ థారేజా మాట్లాడుతూ ప్రస్తుత ఆన్ లైన్ బుకింగ్స్ ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు జావా 42 బైకుల విక్రయం పూర్తయిందని అన్నారు. బ్రహ్మాండమైన ప్రజాదరణ లభించిందన్నారు. ప్రస్తుతం బుకింగ్ చేసుకున్న వారికి వచ్చే ఏడాది మార్చి నుంచి వాహనాలను బట్వాడా చేస్తామని తెలిపారు. 

ప్రతి కొనుగోలుదారుడికి నేరుగా డెలివరీ టైమ్‌లైన్ పంపుతామని, తద్వారా వెయిటింగ్ పీరియడ్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకుడు అనుపమ్ థారేజా అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 100కి పైగా డీలర్ షిప్ లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అనుపమ్ తెలిపారు. 

సోషల్ నెట్‌వర్కింగ్ అసిస్టెంట్‌గా ఏఐ ఆధారిత యాప్ ఆవిష్కరణ
వ్యక్తిగత, సోషల్‌, నెట్‌వర్కింగ్‌ అసిస్టెంట్‌గా పని చేసే కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత యాప్‌ ‘చిట్టీ’ని హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ ‘ఏఐ అసిస్‌’ విడుదల చేసింది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, సూచనలు, సలహాలు ఇవ్వడం, ఇచ్చిన ఆదేశాలను పాటించడంవంటి సేవలను ఈ యాప్‌ అందిస్తుంది.

పర్సనల్ అసిస్టెంట్ మాదిరే వ్యవహరించనున్న ‘చిట్టి’
మామూలు పర్సనల్‌ అసిస్టెంట్‌ మాదిరే ఫోన్‌ కాల్స్‌ చేయడం, కార్యక్రమాల షెడ్యూల్‌ తయారు చేయడం, విషయాలను గుర్తు చేయడం, ఎంటర్‌టైన్‌మెంట్‌, సోషల్‌ మీడియాపై సమాచారం ఇవ్వడం, ఫుడ్‌ ఆర్డర్లు ఇవ్వడం, క్యాబ్‌ను బుక్‌ చేయడం వంటి పనులు కూడా చేస్తుందని ఏఐ అసిస్‌ సీఈఓ శివ కుమార్‌ తెలిపారు. 

‘చిట్టి’ యాప్ ఆవిష్కరణ సంతోషకరం
తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ చిట్టీని విడుదల చేశారు. ఏఐ రంగంలో తెలంగాణ ముందుందని, ఏఐ ఆధారిత యాప్‌ను ఇక్కడ అభివృద్ధి చేయడం సంతోషకరమన్నారు. ట్రిపుల్‌ఐటీ, హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి దీన్ని అభివృద్ధి చేశారు. కార్యక్రమంలో ట్రిపుల్‌ ఐటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రాధిక మామిడి, ఇండస్ర్టియల్‌ రిలేషన్‌షిప్‌ అధిపతి లక్ష్మి మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios