చెన్నై: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటర్స్ వచ్చే నెలలో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్న కాంప్యాక్ట్ సెడాన్ మోడల్ ఔరాను ఆవిష్కరించింది. మారుతికి చెందిన డిజైర్, హోండాకు చెందిన అమేజ్‌ మోడల్ కార్లకు పోటీగా కంపెనీ ఈ కారును విడుదల చేయనున్నది. ఫోర్డ్ ఆస్పైర్, టాటా గిగోర్, ఆన్ న్యూ రెనాల్ట్ ఎల్బీఏ కంపాక్ట్ సెడాన్ మోడల్ కార్లకు పోటీ కానున్నది.

వ్యక్తిగత అవసరాల నిమిత్తం కారును వినియోగించేవారిని లక్ష్యంగా చేసుకొని ఈ కారును రూపొందించినట్లు హ్యుండాయ్ మోటార్ ఎండీ, సీఈవో ఎస్‌ఎస్ కిమ్ తెలిపారు. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మెరుగైన వృద్ధిని నమోదు చేసుకుంటున్న సంస్థ..కాంప్యాక్ట్ సెగ్మెంట్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కారును విడుదల చేసినట్లు చెప్పారు.

also read టాటా నుండి కొత్త వర్షన్ కారు ... దీని ధర ఎంతంటే..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి నెలలో 25 వేల యూనిట్లు అమ్ముడవుతున్న కాంప్యాక్ట్ సెగ్మెంట్‌లో మారుతి, హోండాలో అగ్రస్థానంలో దూసుకుపోతున్నాయి. బీఎస్-6 డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ వాహనాన్ని ఏఎంటీ టెక్నాలజీతో తయారు చేసింది. 

ఈ కారులో వైర్‌లెస్ చార్జింగ్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. డ్యుయల్ బూమరాంగ్ షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, హ్యాచ్ బ్యాక్ సింగిల్ యూనిట్ ‘క్యాస్ కేడింగ్ గ్రిల్’, 15 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 3,995 మిల్లీ మీటర్ల పొడవు, 1520 మిల్లీ మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ఎక్సెంట్ తరహాలో 20 మిల్లీ మీటర్ల వైడర్ (1680 మిల్లీ మీటర్లు), 25 మిల్లీ మీటర్ల లాంగర్ వీల్ బేస్ (2450 మిల్లీ మీటర్లు) కలిగి ఉంటుంది. 

గమ్మత్తేమిటంటే ఔరా సెడాన్ కారు ఇంటీరియర్ డెకరేషన్ తీరును లీక్ చేయలేదు. గ్రాండ్ ఐ10 నియోస్ మాదిరిగానే డాష్ బోర్డు, కంట్రోల్స్, సీట్లు అమర్చారు. 8.0- అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 5.3 అంగుళాల డిజిటల్ స్పీడో మీటర్, ఐఎండీ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

also read  మారుతి సుజుకి ఆల్టో కొత్త వేరియంట్...ఇప్పుడు అప్ డేట్ ఫీచర్స్ తో...

తాజాగా ఔరా మోడల్ కారులో బ్లూ లింక్ కనెక్టివిటీ, గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్ కారులో మాదిరిగానే ఐ బ్లూ ఆడియో స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ కాకుండా ఐ బ్లూ ఐడియో రిమోట్ ఫీచర్ చేర్చారు. బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా సెడాన్ మోడల్ కార్లలో హ్యుండాయ్ ఆవిష్కరించిన తొలి కారు ఔరా.

1.2 లీటర్ల కప్పా పెట్రోల్ ఇంజిన్, 83 హెచ్పీ, 113 ఎన్ఎంతోపాటు 1.2 లీటర్ల డీజిల్ వేరియంట్ మోడల్ కారు 75 హెచ్పీ, 190 ఎన్ఎం శక్తిని కలిగి ఉంటుంది. డీజిల్, పెట్రోల్ వేరియంట్ కార్లలో 5- స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్ బాక్స్ ఉన్నాయి. దీనికి తోడు ఔరా సెడాన్ కారులో 1.0 లీటర్, టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా లభిస్తుంది.