టాటా నుండి కొత్త వర్షన్ కారు ... దీని ధర ఎంతంటే..?
ఒక్కసారి చార్జింగ్‌తో 300 కిలో మీటర్ల ప్రయాణం చేయగల సామర్థ్యం గల నెక్సన్ విద్యుత్ వర్షన్ కారును టాటా మోటార్స్ విడుదల చేసింది. దీని ధర ఇంకా నిర్ణయించకున్నా.. ధరల శ్రేణి రూ.15-17 లక్షల మధ్య ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.
ముంబై: విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశలో టాటా మోటార్స్ మరో అడుగు ముందుకు వేసింది. ప్రజాదరణ పొందిన మోడల్ కారు నెక్సాన్‌లో ఎలక్ర్టిక్ వెర్షన్ (ఈవీ)ను ఆవిష్కరించింది. ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 300 కిలో మీటర్లకు పైగా ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీపై ఎనిమిదేళ్ల గ్యారెంటీని కంపెనీ ఇస్తోంది. కొన్ని వారాల్లోనే నెక్సాన్ ఈవీని వాణిజ్యపరంగా విడుదల చేస్తామని, దీని ధరల శ్రేణి రూ.15-17 లక్షల వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అసలు ధరను మాత్రం కారు విడుదల చేయనున్న సమయంలో వెల్లడించనున్నది.
also read మారుతి సుజుకి ఆల్టో కొత్త వేరియంట్...ఇప్పుడు అప్ డేట్ ఫీచర్స్ తో...
జిప్‌ట్రాన్ టెక్నాలజీ కలిగిన ఈ కారు 9.9 సెకన్ల వ్యవధిలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో 35 కనెక్టెడ్ ఫీచర్లు లభిస్తున్నాయి. ఇప్పటికే టిగోర్ మోడల్‌లో ఎలక్ర్టిక్ వెర్షన్‌ను టాటా మోటార్స్ అందుబాటులోకి తెచ్చింది. దీనికి ఆదరణ బాగుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది.
నెక్సాన్ ఈవీ ద్వారా ఇండివిడ్యువల్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. మొదటగా ఈ కారును 22 నగరాల్లో విడుదల చేస్తారు. ఈ శుక్రవారం నుంచే దీని బుకింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా లేదా ఎంపిక చేసిన క్రోమా స్టోర్ల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
also read యమహా నుంచి కొత్త మోడల్ 125cc ఎఫ్ఐ బైక్...
ఇక నెక్సాన్ ఈవీ గరిష్ఠ ధర రూ.17 లక్షలు ఉన్నా.. ప్రస్తుత నెక్సాన్ ఏఎంటీ వెర్షన్‌కన్నా కేవలం 20 శాతం ఎక్కువ ధర అని కంపెనీ చెబుతోంది. కిలో మీటరుకు కేవలం రూపాయి ఖర్చుతో ఇందులో ప్రయాణం చేయవచ్చని టాటా మోటార్స్ ఎలక్ర్టిక్ మొబిలిటీ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు.
ఈ కారులో పర్మినెంట్ మాగ్నెట్ ఏసీ మోటార్ అమర్చారు. ఇది లిథియం ఆయాన్ బ్యాటరీతో పని చేస్తుంది. దీనికి ఐపీ 67 సర్టిఫికెట్, 30.2 కిలోవాట్ల సామర్థ్యం ఉంది. టాటా మోటార్స్ విడుదల చేస్తున్న రెండో విద్యుత్ మోడల్ కారు ఇది. ఇంతకుముందు టిగోర్ మోడల్ కారును విద్యుత్ వర్షన్‌లో విడుదల చేసింది.