Asianet News TeluguAsianet News Telugu

Ugadi 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో మిథున రాశివారి ఫలితాలు

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా.. మిథున రాశివారి జాతకం ప్రకారం..తలపెట్టిన పనులు నెరవేరును. పెద్దల అభిమానం పొందుతారు. ధన, ధ్యానయ లాభాలుంటాయి. నూతన వస్త్రములు, విలువైన ఆభరణములు ధరిస్తారు. 

Ugadi Horoscope of Gemini in 2022
Author
Hyderabad, First Published Mar 28, 2022, 10:01 AM IST

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి 

మిధునరాశి వారికి శుభకృత్  నామ సంవత్సరంలో ఆదాయం -11, వ్యయం - 05. 

రాజపూజ్యం- 02, అవమానం - 02 .

మిధునరాశి వారికి  శుభకృత్ నామ సంవత్సరంలో 

* గురుగ్రహ ఫలితాలు :- భూములు, గృహములు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మృష్టాన్న భోజన వసతులు, స్త్రీ సౌఖ్యం. స్వ జనులచే దూషింప బడుతారు. వృధా ప్రయాణాలు.  నిలకడలేని పనులు. అధికారులను దూషించుటచే వారిచే చిక్కులు కలుగును. భాగస్వామ్యంచే లాభాలు కలుగును. 
 
* శని "దేవుని" గ్రహ ఫలితాలు:- అష్టమ శని ప్రభావం 17 జనవరి 2023 వరకు ఉంటుంది. దుష్ట సహవాసం, ఆర్ధిక పరమైన ధీర్ఘ వ్యాధి గ్రస్తులకు నిత్యప్రయానం. నాలుగు కాళ్ళ జంతువులతో జాగ్రత్తలు అవసరం. శాంతమే ప్రతి విషయానికి పరిష్కారం. ఆర్ధిక పరమైన రాబడి తగ్గుతుంది. 

* రాహువు ఫలితాలు:- తలపెట్టిన పనులు నెరవేరును. పెద్దల అభిమానం పొందుతారు. ధన, ధ్యానయ లాభాలుంటాయి. నూతన వస్త్రములు, విలువైన ఆభరణములు ధరిస్తారు. 

* కేతువు ఫలితాలు:- పుత్రులతో విభేదాలు, తనకంటే చిన్న వారిని గౌరవించాల్సి వస్తుంది. అధిక శ్రమ, స్వల్ప ప్రయోజనములు. స్త్రీ మూలక ఇబ్బందులు.  

ప్రోత్సాహకరమైన ఫలితాలు లభిస్తాయి. 

మహా అద్భుతమైన సంవత్సరం

సువర్ణమూర్తి ఫలితాలు శని భగవానుడి నుంచి అందుతాయి. 

అనుకూలవంతమైన సంవత్సరం కాబట్టి మంచి పనులు మొదలు పెట్టండి. 

గొడవలకు కాలు దువ్వకపోవడం మంచిది. 

రాజకీయ నాయకులకు ఒడిదుడుకులు వచ్చి అధిష్టానవర్గం మెప్పును పొందలేరు. 

సినిమా రంగం వారికి మంచి ఫలితాలు. 

అన్ని రంగాల వారికి ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు రానున్నాయి. 


అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిది. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కల్గుతుంది. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటుచేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి... సర్వేజనా సుఖినో భవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు..   ఓం శాంతి శాంతి శాంతి: .. మీ ~ డా.ఎం.ఎన్.ఆచార్య

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార స్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు, యుతులు, పరివర్తనలు, గ్రహ అవస్తాలు..  మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఇందులో కేవలం సామూహిక ఫలితాలను మాత్రమే తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక విశ్లేషణలో సరైన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆసక్తి కలవారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. . డా.ఎం.ఎన్.ఆచార్య 

Follow Us:
Download App:
  • android
  • ios