జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) 

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

పంచాంగం:
 తేది : 4 మార్చి 2023
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఫాల్గుణ
ఋతువు : శిశిరం
పక్షం : శుక్ల పక్షము
వారము: శనివారం
తిథి : ద్వాదశి ఉదయం 11 :59
నక్షత్రం : పుష్యమి రాత్రి 7.2ని వరకు
వర్జ్యం: లేదు
అమృత ఘడియలు: ఉదయం 11:58 ని నుండి. గం01:44ని వరకు
దుర్ముహూర్తం: ఉ.06.21 ని నుండి ఉ. గం 7:54 ని వరకు
రాహుకాలం: ఉ.9.00ని. నుండి ఉ.10.30ని. వరకు
యమగండం: మ.01.30ని నుండి మ.3.00ని. వరకు
శని త్రయోదశి

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
సొంత విషయాలు కు మరియు విలాసవంతమైన వస్తువులకు సంబంధించిన విషయాలలో అధికంగా ఖర్చు పెడతారు. కుటుంబ పరంగా కొన్ని ముఖ్య సమస్యలు పరిష్కారమగును. ఈరోజు ఆర్థికంగా లాభపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘములో మీ ప్రతిభకు తగ్గ గౌరవ మర్యాదలు పెరుగును. గృహమునందు సుఖ సంతోషాలతో టి ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాలు వలన అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అంద గలవు. ఈరోజు ఈ రాశి వారు ఓంఅష్టలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
సమాజమునందు విషయాలు అక్కడ వాతావరణం మనస్తాపానికి గురి అవుతారు . మీ ప్రమేయం లేకుండానే వివాదాలు తగాదాలు ఏర్పడతాయి. కుటుంబం నందు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రావచ్చును. సమాజం నందు కొద్దిపాటి ఆరోపణలకు గురవుతారు. కీలకమైన సమస్యల యందు పంతాలు పట్టింపులు వదిలి చర్చల తోటి సమస్యలను పరిష్కరించకోవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం చండి కాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
తలచిన పనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృత్తి ఉద్యోగమునందు కొంత వివక్షతను ఎదుర్కోవలసి వస్తుంది.సంఘమునందు కీర్తి ప్రతిష్టలకు ప్రతికూలత వాతావరణ ఏర్పడును. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించవలెను. శత్రు బాధలు ఉండును. వ్యాపారంలో బాగున్నప్పటికీ ఆదాయం అంతంత మాత్రంగా ఉండును. బంధుమిత్రుల తోటి నిందారోపణలు ఎదురుగును. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఉద్యోగాలపరంగా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడతాయి. కొన్ని విషయాలలో ఒంటరి పోరాటం చేయవలసి వస్తుంది. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది. చేయి వ్యవహారములు లో కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ప్రభుత్వ సంబంధిత పనులలో కొద్దిపాటి ఇబ్బందులు కలగవచ్చు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పట్టుదలతో చేయు పనులు పూర్తి అగును. ఈరోజుఈ రాశి వారు ఓం రవయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
సంఘము నందు అపకీర్తి. అనవసరమైన ఆవేశం, కలహాలు.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.తలపెట్టిన పనులు వాయిదా పడును.జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావచ్చు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి . ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులు ఎదురవును. వృత్తి వ్యాపారంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం కష్టంగా ఉండును. లాభాలు ఉద్యోగము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
కుటుంబ సంబంధించి విషయాలలో మీయొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శింప చేస్తారు. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు. సమాజంలో ఉన్న నిందలను సమర్థవంతంగా తిప్పుకొడతారు. వ్యవహారమునందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకొనవలెను. శుభకార్యాలకు సంబంధిత విషయాలను ఇతరులతోటి చర్చిస్తారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీమాత్రే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
వృత్తి వ్యాపారాలు పరంగా అభివృద్ధి కనబరుస్తారు. ఆరోగ్యవృద్ధి. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించ కొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు ప్రతిభా పాటలు కనపరుస్తారు. సమాజము నందు మీ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును. మానసికంగా సంతోషంగా ఉంటుంది. గృహమునందు ప్రశాంతత వాతావరణఏర్పడుతుంది. విందూ వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం లభించును. ఈరోజుఈరాశి వారు ఓం నారసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
వాహన ప్రయాణాల యందు ఇబ్బందులు కలుగవచ్చు జాగ్రత్త అవసరం. వ్యాపారం వ్యవహారాలు కలిసి వస్తాయి. కొన్ని విషయాలలో విపరీతమైన ఖర్చు చేయవలసి వస్తుంది. విరోధ వివాదాలకు దూరంగా ఉండవలెను. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. చేయ పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. భూ భూ సంబంధిత క్రయ విక్రయాలు కలిసి వచ్చును. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారం నందుఊహించని ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రుల తోటి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. సమాజం నందుఅపనిందలను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. అనుకున్న పనులను వెంటనే ఆచరణలో పెట్టండి. సమస్యలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం జనార్ధనాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ప్రతి విషయంలో వ్యతిరేకతలకు ఏర్పడను. సంఘంలో వ్యతిరేకతలు రావచ్చు. ఊహించని సంఘటనల వలన మనసునందు భయాందోళనగా ఉండును. చేయు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండవలెను. నిష్కారణంగా ఇతరులతోటి విభేదాలు ఏర్పడను. కుటుంబము నందు మార్పులు చేర్పులు జరుగుతాయి. కొన్ని సమస్యల వలన ఆందోళన ఏర్పడుతుంది. అనాలోచిత పనుల వలన కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు బాగా రాణించడంతో ఆదాయం బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎటువంటి పనులైన అవలీలలుగా సాధిస్తారు. సంతాన సౌఖ్యం లభిస్తుంది. సంఘమనందు మీ యొక్క ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. సంతోషకరమైన వార్తలు వింటారు. తలచిన పనులు అనుకున్న సమయానికి పూర్తి అగును. ఈ రోజు ఈ రాశి వారు ఓం సదాశివాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
చేయ వ్యవహారమయందు కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించవలెను.శత్రుమూలకంగా ఇబ్బందులుఎదురవుతాయి.ఉద్యోగ సంబంధమైన విషయాలలో గందరగోళం గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అవగాహన తగ్గి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. సమాజము నందు అవమానాలు ఎదురు కావచ్చు. ఆర్థికంగా కొంత నష్టం ఏర్పడును. మానసికంగా లోలోపల భయాందోళనగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు ఓం హిరణ్య గర్భయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.