Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు (18 ఏప్రిల్ ఆదివారం 2021)

ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు.

today 18th april sunday raasi phalalu  akp
Author
Hyderabad, First Published Apr 18, 2021, 7:09 AM IST


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today 18th april sunday raasi phalalu  akp

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. కీలక నిర్ణయాలు. బంధువులతో వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దైవదర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు మిత్రులతో వివాదాలు. కుటుంబ బాధ్యతలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు నిరాశ. వృత్తి, వ్యాపారాలు నత్తనడనక సాగుతాయి. దూరప్రయాణాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పరిశోధనలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక  పరిస్థితి మందగిస్తుంది. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు. ఆలయ దర్శనాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక లావాదేవీలలో నిరుత్సాహం.  విద్యార్థులకు కొంత నిరాశ. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తప్పవు. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వస్తులాభాలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు నూతన ఉద్యోగయోగం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తీరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక లావాదేవీలలో ఒదుడుకులు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత తప్పదు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చికాకులు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం.  ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యవహారాలలో పురోగతి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios