Zodiac Signs: ఈ 3 రాశుల వారు వెండి పెట్టుకుంటే అస్సలు మంచిది కాదు...!
జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో లోహానికి ఒక్కోరకమైన ప్రాధాన్యం ఉంటుంది. గ్రహాలు, రాశులను బట్టి లోహాలను ధరించడం మంచిది. అయితే కొన్ని రాశులవారు వెండి పెట్టుకోవడం అస్సలు మంచిది కాదట. ఏ రాశి వారు వెండి వేసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి లోహం ఏదో ఒక గ్రహానికి సంబంధించిందిగా చెప్తుంటారు. గురు గ్రహాన్ని బలోపేతం చేయడానికి, బంగారు లోహంతో చేసిన వస్తువులను ధరించాలి. అదేవిధంగా, చంద్రున్ని బలోపేతం చేయడానికి వెండి లోహాన్ని ధరించమని సలహా ఇస్తారు. మనస్సు, మహిళలు, ఆత్మవిశ్వాసం మొదలైన వాటికి కారకుడైన చంద్రుడిని బలోపేతం చేయడానికి వెండి వస్తువులను ధరించడం శుభప్రదంగా భావిస్తారు.
వెండిని బహుమతిగా ఇవ్వడం కూడా శుక్రుడిని బలోపేతం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కొన్ని రాశులవారు వెండిని ధరించడం లేదా బహుమతిగా తీసుకోవడం అస్సలు మంచిదికాదట. ఇది వారికి హాని కలిగిస్తుందట. ఇంతకీ ఆ రాశులెంటో ఇక్కడ చూద్దాం.
ఏ రాశుల వారు వెండి ధరించకూడదు?
వృషభ రాశి
జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశి వారు వెండి ఉంగరం లేదా వెండితో చేసిన ఇతర ఆభరణాలు ధరించకుండా ఉండాలి. ఏదైనా వెండి వస్తువును ధరించడం వల్ల వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితాలు మాత్రం వెంటనే రావు. ఆర్థిక పరిస్థితి కూడా బలహీనంగా ఉంటుంది. భార్యాభర్తల బంధంలో విభేదాలు వస్తాయి.
సింహ రాశి
సింహ రాశి చక్రం వారు వెండితో చేసిన వస్తువులను పెట్టుకోకూడదు. సింహ రాశికి ఆధిపత్య గ్రహం సూర్యుడు. ఈ రాశి వారు వెండితో చేసిన వస్తువులను ధరిస్తే వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బుకు సంబంధించి నష్టాలు రావచ్చు. డబ్బు వస్తుంది. కానీ వెంటనే ఖర్చు అవుతుంది. ఈ రాశి వారు ఉద్యోగానికి సంబంధించిన నష్టాలను కూడా ఎదుర్కునే అవకాశం ఉంది.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వారు కూడా వెండి వస్తువులను ధరించకూడదు. దానివల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. చిన్న విషయాలకే గొడవలు మొదలవుతాయి. ఎటువంటి కారణం లేకుండా గొడవలు జరుగుతాయి. రోడ్డు ప్రమాదం కూడా సంభవించవచ్చు. సమస్యలు వాటంతట అవే రావడం మొదలవుతుంది.