న్యూ ఇయర్ లో ధనస్సు రాశివారి రాశిఫలాలు

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 1, Jan 2019, 10:16 AM IST
new year..sagittarius horoscope is here
Highlights

న్యూ ఇయర్ లో ధనస్సు రాశివారి రాశిఫలాలు

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : లగ్న చతుర్థాధిపతి గురుడు వ్యయంలో, ద్వితీయ తృతీయాధిపతి శని లగ్నంలో అష్టమంలో రాహువు, ద్వితీయంలో కేతువు ఉన్నారు. మార్చ్‌ తర్వాత సప్తమంలో రాహువు, లగ్నంలో కేతువు ఉంటారు.

వీరికి ఆధ్యాత్మిక ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. వాటి పై దృష్టి కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక ఖర్చులు కూడా చేస్తారు. విశ్రాంతి లభిస్తుంది. పెట్టుబడులు విస్తరిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పనుల్లో సంతృప్తి లభిస్తుంది. సౌకర్యాలకోసం ఖర్చు చేస్తారు. తమకోసం తాము ఖర్చు పెట్టుకుటాంరు. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది.

మాటలవల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబంలో అసౌకర్యం ఏర్పడుతుంది. సహకారం వల్ల అననుకూలత ఏర్పడుతుంది. సేవకజన సహకారం లభిస్తుంది. కొంత బద్ధకం పెరుగుతుంది. కమ్యూనికేషన్స్‌ విస్తరించే ప్రయత్నం చేస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. వీరు ఎక్కువగా మౌనంగా ఉండి, తక్కువగా మ్లాడడం మంచిది.

ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రమలేని ఆదాయం పైదృష్టి ఉంటుంది. మార్చితర్వాత నుంచి సామాజిక అనుబంధాల్లో ఒత్తిడిపెరుగుతుంది. నూతన పరిచయస్తులతో జాగ్రత్త అవసరం. పెట్టుబడులు ఒత్తిడిని కలిగిస్తాయి.

కుటుంబ సంబంధాలు బలపరచుకునే ప్రయత్నం చేయాలి. వాగ్దానాలు చేయరాదు. మధ్యవర్తిత్వాలు పనికిరావు. అనుకున్న  నిల్వ ధనాన్ని కోల్పోయే సూచనలు. అనవసర ఖర్చులు చేస్తారు. మార్చి తర్వాత నుంచి తమ పనులు తమకే ఒత్తిడిని కలిగిస్తాయి.  తాము చేసే పనుల్లో నిరాశ, నిస్పృహలు ఉంటాయి.

వీరు వాకింగ్‌ ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయాలి. నిత్యవిధిగా అలవాటు చేసుకోవాలి. శరీరాన్ని శ్రమ పెట్టవలసిందే.  15 రోజులకొకసారి ఒంటి కి నూనె ప్టిె మర్దన చేయాలి. శరీరాన్ని శ్రమపెట్టే విధంగా ప్రయత్నం చేయాలి. యోగాసనాలు వేయాలి. ధర్మ కార్యాలకు ప్రయత్నం చేయాలి. మినప సున్ని ఉండలు, ఇడ్లీ వడ దానం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

 

ఇతర రాశుల వివరాలు ఇక్కడ చదవండి

నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందంటే...

నూతన సంవత్సరంలో వృషభరాశి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

న్యూ ఇయర్ లో మిథునరాశి వారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

నూతన సంవత్సరంలో కర్కాటక రాశివారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో సింహరాశి వారి రాశిఫలాలు

న్యూ ఇయర్ లో కన్య రాశివారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో తులరాశి వారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో వృశ్చిక రాశివారి రాశిఫలాలు

loader