సారాంశం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు సమయానుసారం రాశులు, నక్షత్రాలు మారుస్తుంటాయి. దానివల్ల 12 రాశులపై మంచి, చెడు ప్రభావాలు ఉంటాయి. మే 10న చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడి రాశి మార్పు ఐదు రాశుల వారి జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ రాశులెంటో ఓసారి చూద్దామా..

జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు తన రాశిని చాలా త్వరగా మారుస్తాడు. ఏ రాశిలోనైనా రెండున్నర రోజులు ఉంటాడు. నక్షత్రంలో ఒక రోజు ప్రయాణిస్తాడు. పంచాంగం ప్రకారం మే 10 మధ్యాహ్నం 1:42 గంటలకు చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశి మార్పు ఐదు రాశులకు శుభ ఫలితాలనిస్తుంది.

ఏ రాశి వారికి మంచి జరుగుతుంది?

మేషరాశి

మేషరాశి వారికి చంద్ర సంచారం శుభప్రదం. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. బంధం బలపడుతుంది. భేదాభిప్రాయాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రణాళికలు ఫలిస్తాయి. కుటుంబ వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి.

వృషభరాశి

తులారాశిలో చంద్ర సంచారం వృషభరాశి వారికి శుభప్రదం. జీవిత భాగస్వామితో బంధం మెరుగవుతుంది. స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. చంద్రుని అనుగ్రహంతో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవుతాయి. ప్రయాణాలు చేయవచ్చు.

 తులారాశి

చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు. కొత్త ప్రణాళికలపై పనిచేస్తారు. విజయం సాధించడానికి కృషి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలుంటాయి. ధనలాభం ఉంటుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.

మకరరాశి

మకరరాశి వారికి కుటుంబ, వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. బంధం బలపడుతుంది. ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. బయటకు వెళ్లే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

కుంభరాశి

కుంభరాశి వారికి చంద్ర సంచారం చాలా శుభప్రదం. అన్ని సౌకర్యాలు, సుఖాలు పొందుతారు. భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనవసర వివాదాలకు దూరంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. పనిలో ఆసక్తి, ఏదైనా సాధించాలనే ఉత్సాహం ఉంటుంది.