Zodiac Signs: సూర్యుడు, రాహువుల కలయిక.. ఈ 3 రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల ప్రభావం ఎప్పుడూ రాశులపై ఉంటుంది. మంచి, చెడు, లాభం, నష్టం ఇలా ప్రతిదీ ఒక్కోటి ఒక్కోదానితో ముడిపడి ఉంటుంది. మీన రాశిలో సూర్యుడు, రాహువుల కలయిక వల్ల 3 రాశులవారికి లాభాలున్నాయి. ఆ రాశులెంటో ఇప్పుడు చూద్దాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పులు, కదలికలు, కలయికలు అన్ని రాశి చక్రాలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంటాయి. గ్రహాల రాజు సూర్యుడు ప్రస్తుతం శని కుంభరాశిలో ఉన్నాడు. మార్చి 14న సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల ఇది ఇప్పటికే అక్కడ ఉన్న రాహువుతో కలయికను ఏర్పరుస్తుంది. సూర్యుడు, రాహువు కలయిక కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టయోగం ఉంది. ఆ రాశులెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యుడు ఆత్మ, నాయకత్వ సామర్థ్యాలను సూచిస్తాడు. కానీ, రాహువు ఆకస్మిక సంఘటనలకు కారణంగా ఉంటాడు. ఈ రెండింటి కలయిక అన్ని రాశిచక్రాలపై ప్రభావం చూపుతుంది. సూర్యుడు, రాహువు కలయిక ఏ రాశుల వారికి అద్భుతమైన లాభాలు తెస్తుందో ఇక్కడ చూద్దాం.
వృషభ రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి సూర్యుడు, రాహువు కలయిక చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో, మీరు డబ్బు సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు ఉంటాయి. వైవాహిక జీవితంలో ఏ సమస్యలు తలెత్తినా వెంటనే తొలగిపోతాయి.
సింహ రాశి
సూర్యుడు, రాహువుల కలయిక సింహ రాశి వారికి చాలా మంచిది. మీ ఆదాయంలో పెరుగుదల కారణంగా మీ మనస్సు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. ఇద్దరు సంతోషంగా ఉంటారు.
మకర రాశి
మకర రాశి వారికి సూర్యుడు, రాహువు కలయిక చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీంతో పాటు మీ వృత్తి జీవితంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారు గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవసరం. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది.