Ugadi 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సర సింహ రాశి వారి జాతకం..!

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాదిలో.. సింహ రాశివారికి శని గ్రహం ప్రభావంతో మిశ్రమ ఫలితాలు వస్తాయి. రాహువు ప్రభావం కారణంగా, ఆర్థిక పరంగా అద్భుత ఫలితాలొస్తాయి. కేతువు ప్రభావంతో సమస్యలు తొలగిపోతాయి. 
 

Horoscope Of Leo In Ugadi 2022

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి

సింహ రాశి.. ఈ రాశి వారికి ‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం-08, వ్యయం-14 సమానంగా ఉంటుంది. రాజపూజ్యం-01, అవమానం-09 గా ఉంటుంది. గురు గ్రహం ప్రభావం ప్రతికూలంగా ఉండటం వల్ల మీకు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు రావొచ్చు. శని గ్రహం ప్రభావంతో మిశ్రమ ఫలితాలు వస్తాయి. రాహువు ప్రభావం కారణంగా, ఆర్థిక పరంగా అద్భుత ఫలితాలొస్తాయి. కేతువు ప్రభావంతో సమస్యలు తొలగిపోతాయి. 

సింహరాశి వారికి శుభకృత్  నామ సంవత్సరంలో ఆదాయం - 08 - వ్యయం -  14

రాజపూజ్యం-  01 - అవమానం - 05

సింహరాశి వారికి  శుభకృత్ నామ సంవత్సరంలో 

* గురుగ్రహ ఫలితాలు :- సంవత్సర ప్రారంభం నుండి 6 ఏప్రిల్ 2022 వరకు గురువు సప్తమ భావంలో ప్రతి విషయంలో విజయం మీదే అన్నట్లుగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. భూములు కొంటారు. 7 ఏప్రిల్ 2022 నుండి అష్టమ భావంలో సంచారం వలన చేయని నేరాలు మోపబడుతావి. మనోవేదన, అప్పులు చేయవలసి వస్తుంది. అనుకూల వాతావరణం అనేది కనవబడదు. రుణాల ఒత్తిడి ఎక్కువౌతుంది. 
 
* శని "దేవుని" గ్రహ ఫలితాలు:- సంవత్సర ప్రారంభం నుండి 18  ఫిబ్రవరి 2023 వరకు షష్టమ స్థానం అయిన మకరరాశిలో నుండి కుంభరాశి సప్తమ భావంలో సంచారం చేయును. వృత్తి, వ్యాపారలలో ఎదురులేని ఆర్ధిక వనరులను చవిచూస్తారు. గౌరవాన్ని పొందుతారు, తీర్ధ యాత్రలు సందర్శిస్తారు. సప్తమ భావంలో ప్రవేశించినప్పటినుండి కుటుంబ జీవితంలో లోటుపాటులు కనిపిస్తాయి. దూర ప్రాంతాలో నివసించటచే మన:శాంతి తగ్గును. 

* రాహువు ఫలితాలు:- నవమ సంచార ఫలములు నవమ సంచారం వలన వాహనాల వలన ఇబ్బందులు ఏర్పడే సూచలున్నాయి. కుటుంబంలోని పెద్దలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు. వ్యవహార చిక్కులు, అన్నింటిలోనూ జాగ్రత్తగా మసులుకోవాలి.  

* కేతువు ఫలితాలు:- తృతీయ స్థాన సంచారం వలన వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ప్రతి పనిని సమన్వయంతో యుక్తితో నిర్వహించి విజయాన్ని కైవసం చేసుకుంటారు. 

రాజకీయ నాయకులకు సెప్టెంబర్ వరకు స్వంత పార్టీ వారితో ఇబ్బందులుంటాయి. 

వ్యవసాయ దారులకు మొదటి పంట అనుకూలం. 

ఉద్యోగస్తులకు ఇష్టం లేని బదిలీలు. తోటి వారితో వ్యతిరేకత, అధికారుల సఖ్యత కనబడదు. 

వ్యాపారస్తులకు అనుకూలం. 

విద్యార్ధులు ఎక్కువ శ్రమ పడాలి.   

ఇబ్బందికరమైన పరిస్థితులు. 

అధిక ఖర్చు, ఎక్కవ అవమానం. 

సంవత్సర చివరి కాలం అనుకూలం. 

మాటను, నోరుని అదుపులో ఉంచండి. 

ప్రతి పనిలో పూర్తి ఏకాగ్రత ఉంచండి. 

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు శని రాహు జపాలు చేయించండి. దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిది. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కల్గుతుంది. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటుచేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి... సర్వేజనా సుఖినో భవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు..   ఓం శాంతి శాంతి శాంతి: .. మీ ~ డా.ఎం.ఎన్.ఆచార్య

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార స్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు, యుతులు, పరివర్తనలు, గ్రహ అవస్తాలు..  మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఇందులో కేవలం సామూహిక ఫలితాలను మాత్రమే తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక విశ్లేషణలో సరైన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆసక్తి కలవారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. . డా.ఎం.ఎన్.ఆచార్య 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios