విపరీతమైన కోపమా..? ఈ వాస్తు చిట్కాలతో పరిష్కారం...!
కోపం అనే ఫీలింగ్ రోజురోజుకూ పెరిగిపోతూ అదుపులో పెట్టుకోలేకపోతే దానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. వాతావరణం, దిశ, నివాస గృహం కార్యాలయం పర్యావరణ ప్రభావాల కారణంగా కూడా కోపం పెరుగుతుంది.
కొత్త ఇంటికి మారారా? కొత్త ఆఫీసుకి లేదా కొత్త ప్రదేశానికి వెళ్లిన కొద్ది రోజుల్లోనే మూడ్‌లో తేడా కనిపిస్తోందా? కోపం వస్తోందా? లేక ఇంటిలోని ఏ సభ్యుడికైనా కోపం పెరుగుతోందని అనిపిస్తోందా? ఇలా జరగడానికి వాస్తు లోపం కూడా కారణం కావచ్చట. కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
శ్రీకృష్ణుడు తన శ్లోకంలో చెప్పినట్లుగా, మనిషి పతనానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. అవి కామం, క్రోధం, దురాశ. ఈ దుర్గుణాలు మనిషిని వినాశనం వైపు నడిపిస్తాయి. జీవితంలో సంతోషంగా లేని వ్యక్తి ఎక్కువ కోపం తెచ్చుకుంటాడు, ఆ వ్యక్తి జీవితం దానిలోనే మునిగిపోతుంది. కాబట్టి ఏ కారణం చేతనైనా కోపం తెచ్చుకోవడం సరికాదు. అయితే కోపం అనే ఫీలింగ్ రోజురోజుకూ పెరిగిపోతూ అదుపులో పెట్టుకోలేకపోతే దానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. వాతావరణం, దిశ, నివాస గృహం కార్యాలయం పర్యావరణ ప్రభావాల కారణంగా కూడా కోపం పెరుగుతుంది.
• ఆగ్నేయ దిశకు తల పెట్టి నిద్రించవద్దు...
ఆగ్నేయ దిశను అగ్ని మూల అని అంటారు. ఈ దిశలో తలపెట్టి నిద్రించడం ఏ కారణం చేతనైనా సరికాదు. నిద్రించే దిశ తూర్పు, దక్షిణంగా ఉండాలి. ఆగ్నేయం వైపు తల పెట్టి పడుకోవడం వల్ల కోపం పెరుగుతుంది. కోపం అగ్నిలా మండుతుంది. ఈ దిక్కులో ఎక్కువ సేపు కూర్చోవడం కూడా మంచిది కాదు.
• సైంధవ లవణం
ఇంట్లో ఎవరికైనా కోపం ఎక్కువగా ఉంటే సైంధవ లవణాన్ని ఇంట్లో ఏ మూలన లేదా పడక గదిలో ఎక్కడైనా ఉంచాలి.
• ముత్యాల ధారణ (ముత్యం)
జన్మ కుండలి ఆధారంగా, కోపంతో ఉన్నవారు ముత్యాలను ధరించవచ్చు. నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.
• గురు మంత్రం
కోపం వచ్చినప్పుడు గురు మంత్రాన్ని జపించాలి. లేదా వారి తల్లిదండ్రులను గుర్తుంచుకోండి.
• ఎరుపు రంగు
ఇంట్లో మీకు కోపం తెప్పించే వ్యక్తులు ఉంటే, ఎరుపు రంగును ఉపయోగించవద్దు. గోడ ఎరుపు రంగులో ఉండకుండా, ఎరుపు రంగు లైట్లు ఉపయోగించకుండా చూసుకోవాలి.
• పారిశుధ్యం
ఇల్లు శుభ్రంగా లేకపోయినా కోపం ఎక్కువవుతుంది. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
• తూర్పు దిశలో కాంతి
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తూర్పు దిక్కున దీపం వెలిగిస్తే ఇంట్లోని వారి కోపం తగ్గుతుంది. అలాగే బరువైన వస్తువులను తూర్పు దిశలో పెట్టకూడదు.
• సోమవారం ఉపవాసం
కోపం వచ్చిన వారు సోమవారం ఉపవాసం ఉండాలి. ఆహారం ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. రాత్రి చంద్రునికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించాలి.
• భూమికి నమస్కారం
ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే భూమి మాతకు 5 సార్లు నమస్కరించాలి, అలాగే కోపాన్ని అదుపు చేసుకునేందుకు భూమి మాతను అడగాలి. ప్రార్థించండి.
సూర్యనమస్కారం, ప్రాణాయామం
శాస్త్రోక్తంగా ప్రతిరోజూ సూర్యనమస్కారం, ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో శక్తి పుంజుకుంటుంది. వీటి ద్వారా కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. మానసిక సమస్యలకు ప్రాణాయామం ఎంతో మేలు చేస్తుంది.