సారాంశం

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 08.04.2025  మంగళవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో గొడవలు రావచ్చు. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాల్లో గందరగోళ వాతావరణం ఉంటుంది. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

వృషభ రాశి ఫలాలు

ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు అధికారులతో సమస్యలు వస్తాయి. ఆర్థికంగా నిరాశ తప్పదు. వృత్తి, వ్యాపారాలు నెమ్మదిస్తాయి.

మిథున రాశి ఫలాలు

ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం. కుటుంబానికి సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

కర్కాటక రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు లాభదాయకం. ధన, వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుంది. వాహనయోగం ఉంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత  ఉత్సాహంగా ఉంటాయి.

సింహ రాశి ఫలాలు

అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. ఆరోగ్య సమస్యల వల్ల చికాకులు తప్పవు. ముఖ్యమైన పనులు మధ్యలో ఆగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి వస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు.

కన్య రాశి ఫలాలు

ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగాలు కలిసిరావు

తుల రాశి ఫలాలు

దైవ అనుగ్రహంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రులతో సఖ్యతగా ఉంటారు. వారి నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. వాహనయోగం ఉంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అనుకూలం.

వృశ్చిక రాశి ఫలాలు

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు వస్తాయి. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి.

ధనస్సు రాశి ఫలాలు

బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో  ప్రమోషన్లు పెరుగుతాయి.

మకర రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రమే. ముఖ్యమైన  వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి.

కుంభ రాశి ఫలాలు

నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో  సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి  శుభవార్తలు వింటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూలం. సాలరీ పెరిగే అవకాశం ఉంటుంది.

మీన రాశి ఫలాలు

ఉద్యోగంలో శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు.  వ్యాపారాలు అనుకున్న విధంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది.