Astrology: తులసి మొక్క మట్టిలో ఈ ఒక్కటి పెడితే చాలు.. డబ్బులకు లోటే ఉండదు!

ఇళ్లు అన్నాకా సమస్యలు రావడం సహజం. కానీ ఎప్పుడూ అదే పనిగా సమస్యలు వెంటాడితేనే బాధ. ఎప్పుడూ ఇంట్లో డబ్బులు లేకపోవడం, గొడవలు రావడం, ప్రశాంతత లేకపోవడం లాంటి సమస్యలుంటే ఈ ఒక్క పనితో వాటిని దూరం చేసుకోవచ్చు! అదెంటో తెలుసుకోండి మరి.

 

Basil Plant Benefits Burying a Coin for Financial Peace and Debt Relief in telugu KVG

కుటుంబంలో అప్పుడప్పుడు గొడవలు, ఆర్థిక ఇబ్బందులు రావడం సహజం. కానీ ఎప్పుడు డబ్బులు లేకపోవడం, గొడవలు, అప్పుల బాధలు మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇళ్లు ప్రశాంతంగా ఉండడానికి సులువైన మార్గాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి మొక్క మట్టిలో ఒక వస్తువును పాతిపెట్టడం ద్వారా డబ్బుతో సహా అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. హిందూ ధర్మంలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిని లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. ఉదయం లేవగానే తులసికి పూజ చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. దీంతో పాటు, తులసి అనేక ఆరోగ్యకరమైన లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇంట్లో సానుకూల శక్తి నిలవడానికి తులసి సహాయపడుతుంది. 

తులసి మొక్క మట్టిలో రూపాయి నాణం పెడితే ఏమవుతుంది?

తులసి మొక్క మట్టిలో ఒక రూపాయి నాణెం పాతిపెట్టాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. రూపాయి నాణేన్ని మట్టిలో పాతిపెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

1. ఇంట్లో వాస్తు దోషం ఉంటే, తులసి మొక్క మట్టిలో ఒక రూపాయి లేదా రాగి, వెండి నాణెం ఉంచాలి. దీనివల్ల ఇంట్లో ప్రతికూలత తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది. సానుకూలత పెరిగినప్పుడు ఇంట్లో శాంతి, ప్రశాంతత నెలకొంటాయి. 

2. తులసి మొక్క మట్టిలో ఒక రూపాయి నాణెం పాతిపెట్టడం వల్ల శని, రాహువుల ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. శని సాడేసాతి లేదా రాహు-కేతువుల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. 

3. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటే, తులసి మొక్క మట్టిలో ఒక రూపాయి నాణెం పాతిపెట్టాలి. తులసి మట్టి శక్తి వల్ల రూపాయి నాణెం ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది.

4. మీ ఇంటి సభ్యుల జాతకంలో పితృ దోషం ఉంటే, తులసి మొక్క మట్టిలో ఒక రూపాయి నాణెం పాతిపెట్టాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. పితృ దోష సమస్యలు తొలగిపోతాయి. 

5. తులసి మొక్క మట్టిలో కేవలం 1 రూపాయి పాతిపెడితే సరిపోదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా తులసిని పూజించాలి. అలాగే నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి. అలాగే తులసి మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి.

గమనిక
ఇది ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios