రాబోయే 20 రోజుల్లో మన ఐదేళ్ల జీవితం గురించి నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు వైసీపీ విజయవాడ లోక్‌‌సభ అభ్యర్థి పీవీపీ. ప్రత్యేకహోదా విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో పీవీపీ విజయవాడలో మీడియా ముందుకు వచ్చారు.

అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లు, బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టిన వారు ఏ పార్టీలో ఉన్నారో అందరికి తెలుసునన్నారు. తనకు సీబీఐ నుంచి క్లీన్‌చీట్ వచ్చిందని పీవీపీ స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా తాము వెనుకంజ వేయమని ఆయన తెలిపారు.

కుట్రలు, కుతంత్రాలు వాళ్ల డీఎన్‌ఏలో ఉందంటూ పరోక్షంగా టీడీపీని ఉద్దేశిస్తూ వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా విషయంలో తాను మాట్లాడని మాటలను తనకు ఆపాదిస్తూ ముఖ్యమంత్రి రాద్దాంతం చేస్తున్నారని పీవీపీ మండిపడ్డారు. నెగటివ్‌గా మాట్లాడి వాళ్ల మైండ్‌గేమ్‌లో, ట్రాప్‌లో తాను పడనని వరప్రసాద్ తెలిపారు.