జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీ నేత, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు మండిపడ్డారు. పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టానని చెప్పిన లక్ష్మీనారాయణ ఆరున్నర కోట్లు ఆస్తులుగా చూపిస్తున్నారని, ముంబైలో రూ.5 కోట్లకు ఫ్లాట్ అమ్మినట్లుగా అఫిడవిట్‌లో సమర్పించారని పండుల తెలిపారు.

ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేదని చెప్పిన లక్ష్మీనారాయణకు ఏడాదికి రూ.20 లక్షలకు మించి ఆదాయం రాదన్నారు. కేవలం క్వీడ్ ప్రోకోలో జరిగిన అగ్రిమెంట్‌తోనే రూ. ఆరున్నర కోట్లు మొబిలెసెట్స్‌గా తీసుకొచ్చి దానిని తెల్లధనంగా మార్పు చేసి హైదరాబాద్‌ శివారులోని శంకరపల్లిలో భూమి కొన్నారని రవీంద్రబాబు ఆరోపించారు.

కులాల కతీతంగా పనిచేస్తానని చెబుతున్న లక్ష్మీనారాయణ మహారాష్ట్రలో పనిచేస్తూ అంబేద్కర్‌ను ఏనాడైనా కొలిచారా అని ఎంపీ ప్రశ్నించారు.