అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే దాదాపుగా 150 స్థానాల్లో విజయం సాధించే దిశగా ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. 

కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు లోక్ సభ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా అడుగుల వేస్తోంది. 25 పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 

మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ లాంటి నేతలు సైతం వెనుకంజలో ఉన్నారు. దీంతో పార్లమెంట్ స్థానాల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది.