Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన: తొలిజాబితాలో టికెట్ దక్కించుకుంది వీరే.....

అనకాపల్లి, తిరుపతి, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చెయ్యాల్సి ఉందని తెలుస్తోంది. అయితే తొలివిడతగా 9 మంది అభ్యర్థులను విడుదల చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శనివారం రాత్రి 9.15 నిమిషాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆ పార్టీ నేతలు ప్రకటించారు. 
 

ysr congress party announced contestant mp candidates first list
Author
Hyderabad, First Published Mar 16, 2019, 9:26 PM IST

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్దమైంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేశారు. 25 పార్లమెంట్ సభ్యులకు గానూ దాదాపుగా 22 మంది అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

అనకాపల్లి, తిరుపతి, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చెయ్యాల్సి ఉందని తెలుస్తోంది. అయితే తొలివిడతగా 9 మంది అభ్యర్థులను విడుదల చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శనివారం రాత్రి 9.15 నిమిషాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఆ పార్టీ నేతలు ప్రకటించారు. 

అలాగే ఆదివారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి తొలిజాబితాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించనున్నట్లు ఆ పార్టీ నేతలు ప్ రకటించారు. అలాగే పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇకపోతే తొమ్మిదిమంది పార్లమెంట్ అభ్యర్థులలో ఇద్దరు సిట్టింగ్ అభ్యర్థులకు తిరిగి సీట్లు కేటాయించారు. కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పి.మిథున్ రెడ్డిని తిరిగి ప్రకటించారు. తొలివిడత జాబితాలో ముగ్గురు బీసీలకు, ముగ్గురు ఎస్సీలకు, ఒక ఎస్టీ, ఇద్దరు రెడ్డి సామాజకి వర్గాలకు పెద్దపీట వేశారు వైఎస్ జగన్.

వైసీపీ పార్లమెంట్ అభ్యర్థులు
1. కడప- వైఎస్ అవినాష్ రెడ్డి
2. అమలాపురం- చింతా అనురాధ
3. అరకు- మాధవి గొట్టేటి
4. బాపట్ల-నందిగాం సురేష్
5. రాజంపేట-పి.మిథున్ రెడ్డి
6. హిందూపురం-గోరంట్ల మాధవ్
7. కర్నూలు-సంజీవ్ కుమార్
8.అనంతపురం- తలారి రంగయ్య
9. చిత్తూరు- ఎన్ రెడ్డప్ప
 

Follow Us:
Download App:
  • android
  • ios