కడప:  కడప జిల్లాలో క్లీన్ స్వీప్ దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోంది. కడప జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. కడప పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. 

సమీప ప్రత్యర్థి మంత్రి ఆదినారాయణరెడ్డిపై రెండులక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో జమ్మల మడుగు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి ఆదినారాయణ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరి మంత్రి అయిపోయారు. 

ఇకపోతే కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు ఆదినారాయణరెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ లో అడుగుపెడతానన్న ఆయన ఆశలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడియాసలు చేసింది. 

ఇకపోతే రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి డీకే సత్యప్రభపై లక్షకు పైగా మెజారిటీతో గెలుపొందారు.