అనంతపురం: హిందూపురం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ లోక్‌సభ అభ్యర్థి గోరంట‍్ల మాధవ్‌ నివాసంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మాధవ్‌ తండ్రి కురుబ మాధవస్వామి శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. 

ఆయన వయస్సు 85 ఏళ్లు. మాధవస్వామి అంత్యక్రియలు కర్నూలు జిల్లా పి.రుద్రవరంలో జరుగుతాయి. మాధవస్వామి మృతి పట్ల  వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు.

పోలీసు అధికారి అయిన గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెసు తరఫున హిందూపురం నుంచి లోకసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.