ఒంగోలు: టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేందుకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని వీడేందుకు దాదాపు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతుంది. 

గురువారం సాయంత్రంలోపు ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మంత్రి శిద్ధా రాఘవరావు ఫైనల్ కావడంతో ఇక ఆయన ముహూర్తం చేసుకున్నారని తెలుస్తోంది. 

శుక్రవారం ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. గురువారం సాయంత్రంలోపు పార్టీకి రాజీనామా చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్లి శుక్రవారం ఉదయం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతరపున పోటీ చెయ్యనున్నట్లు తెలుస్తోంది.