విశాఖపట్నం : ఎన్నికల ప్రచారంలో అడ్డంగా బుక్కయ్యే నాయకులలో సినీ అగ్రహీరో బాలకృష్ణ ఒకరు. ఈయన తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తాజాగా విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని భీమునిపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

తన చిన్నల్లుడు విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ భరత్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమునిపట్నం గంట స్థంభం వద్ద బాలకృష్ణ మాట్లాడుతుండగా జై బాలయ్య అంటూ అభిమానులు నినాదాలు చేశారు. 

బాలకృష్ణ మాట్లాడదామనుకునే సరికి జై బాలయ్య అంటూ నినాదాలు చెయ్యడంతో ఆయన విసుగెత్తిపోయారు. ఏయ్ మాట్లాడకు అంటూ సైగలు చేస్తూ నానా హంగామా చేశారు. వేలి ఎత్తి చూపుతూ వార్నింగ్ ఇవ్వడంతో అభిమానులు అవాక్కయ్యారు. 

దీంతో అక్కడ నుంచి అభిమానులు ఉడాయించారు. ఇలా ఉగాది రోజున బాలయ్య అభిమానులను తిట్టిపోశారు. బాలయ్య ఎన్నికల ప్రచారంలో వార్నింగ్ లు ఇవ్వడం, బండ బూతులు తిట్టడం కొత్తేమీ కాదు. 

ఇప్పటికే ఏయ్‌ నీ సంగతి చెబుతా.. పీక కోస్తా.. నాకొడకా.. ఏసీపాడదొబ్బుతా..’ అంటూ అనంతపురం జిల్లా హిందూపురం ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఏకంగా జర్నలిస్ట్ పైనే చెయ్యి చేసేకున్నారు బాలయ్య. తాజాగా అభిమానులకు వార్నింగ్ ఇవ్వడంతో అంతా అవాక్కవుతున్నారు.