అమరావతి: సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి నంద్యాల లోకసభ స్థానం నుంచి, ఆయన అల్లుడు సుధీర్ రెడ్డి నంద్యాల శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థులుగా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది తెలుగుదేశం పార్టీని కలవరపెడుతోంది. 

స్వతంత్ర అభ్యర్థిగా నంద్యాల లోకసభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఎస్పీవై రెడ్డిని పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనలోకి ఆహ్వానించి ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చారు. దాంతో తెలుగుదేశం పార్టీ చిక్కుల్లో పడింది.

ఎస్పీవై రెడ్డిని పోటీ నుంచి విరమింపజేయడానికి తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రంగంలోకి దిగారు. పోటీ నుంచి విరమించుకోవాలని ఆయన ఎస్పీవై రెడ్డిని కోరుతున్నారు. సుధీర్ రెడ్డిని కూడా విరమింపజేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. 

జరిగిన పొరపాటును సరిదిద్దుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎస్పీవై రెడ్డి కూతురు సజ్జల సుజాతను అమరావతికి ఆహ్వానించారు.