రీకౌంటింగ్‌కు వైసీపీ పట్టు: శ్రీకాకుళం లోక్‌సభ ఫలితం నిలిపివేత
శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో ఫలితం ఉత్కంఠగా మారింది. తొలుత టీడీపీ సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించినట్లు ప్రకటించినప్పటికీ.. వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాసరావు రీకౌంటింగ్ నిర్వహించాలని పట్టుబడుతుండటంతో ఫలితం ఆలస్యమవుతోంది.

దీనిపై ఎన్నికల అధికారులు కలెక్టర్ నివాస్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన ఫలితాన్ని నిలుపుదల చేసి ఎన్నికల ఆదేశం కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితం నిలిచిపోయే సమయానికి రామ్మోహన్ నాయుడు 6,808 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.