అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 36 శాసనసభా స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసి వెల్లడించింది.

ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలి జాబితాలో అభ్యర్థిగా ప్రకటించిన వేటుకూరి వెంకట శివరామరాజును నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపి అధినేత చంద్రబాబు నిర్ణయించారు.  రాజమండ్రి నుంచి మురళీమోహన్ కోడలు రూపను పోటీకి దించుతున్నారు.

లోక్‌సభ అభ్యర్థులు వీరే..

1. శ్రీకాకుళం- రామ్మోహన్‌ నాయుడు
2. విజయనగరం- అశోక్‌ గజపతిరాజు
3. అరకు- కిషోర్‌ చంద్రదేవ్‌
4. విశాఖ- భరత్‌
5. అనకాపల్లి- ఆడారి ఆనంద్‌
6. కాకినాడ- చలమలశెట్టి సునీల్‌
7. అమలాపురం- గంటి హరీష్‌
8. రాజమండ్రి- మాగంటి రూప
9. నర్సాపురం- వేటుకూరి వెంకట శివరామరాజు
10. ఏలూరు- మాగంటి బాబు
11. విజయవాడ- కేశినేని నాని
12. మచిలీపట్నం- కొనకళ్ల నారాయణ
13. గుంటూరు- గల్లా జయదేవ్‌
14. నర్సారావుపేట- రాయపాటి సాంబశివరావు
15. బాపట్ల- శ్రీరాం మాల్యాద్రి
16. ఒంగోలు- శిద్దా రాఘవరావు
17. నెల్లూరు- బీదా మస్తాన్‌రావు
18. కడప- ఆది నారాయణరెడ్డి
19. హిందూపురం- నిమ్మల కిష్టప్ప
20. అనంతపుం- జేసీ పవన్‌రెడ్డి
21. నంద్యాల- మాండ్ర శివానంద్‌రెడ్డి
22. కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
23. రాజంపేట- డీకే సత్యప్రభ
24. తిరుపతి- పనబాక లక్ష్మి
25. చిత్తూరు- శివప్రసాద్‌