విశాఖపట్నం: విశాఖపట్నం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి, సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలిశారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత ఆయన శ్రీశారదా పీఠాన్ని దర్శించుకున్నారు. 

రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే స్వరూపానంద స్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. శ్రీ శారదా పీఠాన్ని ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ సందర్శించారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 

అలాగే తిరుమల శ్రీవారిని దర్శిచుకున్న అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిశారు. ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్ కు అభినందనలు తెలిపిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు అందించారు. 

వైఎస్ జగన్ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలవడంపై తెలుగుదేశం పార్టీ పెద్ద రాద్ధాంతమే చేసింది. స్వామిజీలకు రాజకీయాలు ఎందుకంటూ టీడీపీ నేతలు హెచ్చరించారు. అయితే బాలకృష్ణ చిన్నల్లుడు విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ స్వరూపానంద స్వామిని కలవడం ఆశీస్సులు తీసుకోవడంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.