విశాఖపట్నం: సినీ నటుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు ముహూర్తాలపై, వాస్తుపై తెగ నమ్మకం. ముహూర్తం చూసుకునే ప్రతీ పనీ ప్రారంభిస్తారు. తన చిన్నల్లుడు శ్రీభరత్ మామ బాలకృష్ణ సలహాను పాటించారు. 

విశాఖపట్నం లోకసభ టీడీపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీభరత్ ఎమ్మెల్యే అభ్యర్థులందరితో కలిసి నామినేషన్ వేయాలని అనుకున్నారు. కానీ, బాలకృష్ణ ముహూర్తం చూసి,ఆ ముహూర్తానికే నామినేషన్ వేయాలని సూచించారు. దీంతో శ్రీభరత్ తన ఆలోచనను పక్కన పెట్టి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. 

శ్రీభరత్ విజయాన్ని కోరుతూ బాలకృష్ణ నామినేషన్ దాఖలుకు మంచి ముహూర్తం చూశారని అంటున్నారు. దీంతో హంగూ ఆర్భాటం లేకుండా శ్రీభరత్ నామినేషన్ దాఖలు చేశారు. 

నామినేషన్ వేసే సమయంలో శ్రీభరత్ వెంట ఆయన తండ్రి రామారావు, చిన్నాన్న లక్ష్మణరావు, ఆయన కుమారుడు భరద్వాజ్ ఉన్నారు.