కడప: అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఆధిక్యత దిశగా దూసుకుపోతున్న వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాల్లోనూ భారీ విజయం దిశగా పయనిస్తోంది. 

ఇకపోతే లోక్ సభ అభ్యర్థుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం నమోదైంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఘన విజయం సాధించారు. 

సమీప టీడీపీ అభ్యర్థి డీకే సత్యప్రభుపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో మిథున్ రెడ్డి విజయం సాధించారు. మిథున్ రెడ్డి రెండోసారి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో కూడా మిథున్ రెడ్డి భారీ విజయం సాధించారు.